Saturday, November 23, 2024

దుర్గగుడి దసరా ఆదాయం రూ.11.51 కోట్లు

అమరావతి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం(దుర్గగుడి)లో దసరా శరన్నవరాత్రులకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. హుండీ ద్వారా రూ.7.51కోట్ల ఆదాయం రాగా, వివిధ సేవలు, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.4కోట్ల ఆదాయం వచ్చింది. గత మూడు రోజులుగా శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అధికారులు హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. హుండీ లెక్కింపుల్లో రూ.7కోట్ల 50లక్షల 84వేల 836 రాగా బంగారం కిలో 448 గ్రాములు, వెండి 26 కిలోల 577 గ్రాములు వచ్చింది. స్పెషల్‌ ప్రొటక్షన్‌ ఫోర్స్‌(ఎస్పీఎఫ్‌) బలగాల భద్రత నడుమ ఆలయ పాలక మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి డీ.భ్రమరాంబ హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement