Tuesday, November 26, 2024

దివ్యగుణ ధారణ మరియు ఆత్మ నిశ్చయం

ఆత్మాభిమానిగా అగుట వలననే దివ్య గుణ ధారణ అవుతుంది. సర్వగుణ నిధి భండారా శివ పరమాత్మయే. మనం ఆత్మిక స్వరూపంలో ఉన్నప్పుడు పరమపిత పరమాత్మ, స్మృతి తప్పక కలుగుతుంది. ఈశ్వరీయ స్మృతితో మధురత, ప్రేమ , శీతలత్వం, అంతర్ముఖత్వం, సహనశీలత, అచంచలత్వం , నిర్భయత మెదలగు గుణాలన్నీ తప్పకుండా ధారణ అవుతాయి. ఆత్మ దేహానికి భిన్నమైన నిరాకార స్వరూపమయ్యే ఉన్నది. నిరాకార స్థితిలో ఉండుట వలన నిరహంకారత్వ స్థితి కలుగుతుంది. నిరహంకారత్వం అన్ని గుణాలకు నిధి వంటిది. కావున దివ్య గుణాలనే వ ృక్షానికి బీజం ఆత్మ నిశ్చయము, రాక్షస లక్షణాల బీజం దేహాభిమానం అని స్పష్టమవుతుంది. గనుక ఆత్మ నిశ్చయంలో తప్పకుండా ఉండాలి. దీనితోనే దివ్యగుణాలు విషయంలో కూడా ఉన్నతి కలిగి మనం దేవతలుగా తయారవుతాము. జీవన్ముక్తి దేవపదవి ప్రాప్తికి ఆత్మచింతన ఒక్కటే సోపానము. పతితులయ్యే సోపానం పరచింతన. పరచింతనలో దేహ చింతన దేహాభిమానం అన్ని కలిసి వున్నాయి. దేహము వేరు మనం వేరు మనం దేహానికి అతీతమైన ఆత్మలము.

….బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గుడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement