గతవారం భూదానం, అన్నదానం, తిలాదా నం వాటివైశిష్ట్యం తెలుసుకొన్నాము. గోదా నం, హిరణ్యదానం (బంగారం), విద్యాదా నం వంటి మరి కొన్ని దానాల విశేష ఫలితాలగురించి తెలుసుకొందాం! మనిషి తన జీవితంలో తెలిసి కొన్ని, తెలియక కొన్ని ఎన్నో పాపాలను చేస్తుంటాడు. దుష్కర్మలను చేస్తూంటాడు. అటువంటి పరిస్థితిలో గోదానం కనుక చేస్తే ఆ పాపం పటాపంచలైపోతుం దని వేదాలు, పురాణాలు విశదపరుస్తున్నాయి. అంతే కాక, మానవుడు మరణించిన అనంతరం యమ భటులు జీవుణ్ణి యమధర్మరాజు న్యాయస్థానానికి తీసుకువెడతారని, ఆ దారిలో ”వైతరణీ” నదిని దాట వలసి ఉంటుందని దానిని గోదానంతో సులభంగా దాటవచ్చని కొన్ని పురాణాల్లో ఉంది. వైతరణీ నది నెత్తురు, చీము లతో నిండి ప్రవహిస్తుంటుందని అది సామాన్యంగా దాటడం కష్టం కనుక గోదానం చేసిిన వారు ఆ గోవు తోక సహాయంతో సులువుగా వైతరణీ నదిని దాట గలరని చెబుతారు. అందుకే శ్రాద్ధ కర్మలు వంటి వాటిలో దశదా నాలు చేయిస్తుంటారు. వాటిలో గోదానం ఒకటి. గోదానం చేసిన వ్యక్తులు చంద్ర లోకంలో నివసించే పుణ్యాన్ని పొం దుతారు. ఆ పితృదినాలలోనే కాకుండా కూడా చాలామంది గోదానం చేస్తుం టారు. గోదానానికి ముందు రోజు ఉపవాసము ఉండి, ఒకసారి గోశాలకు వెళ్ళి, అక్కడ ఉన్న గోవులకు ఆహారాన్ని ఇచ్చి, కొంత సమయం గడిపి, మరునాడు స#హృదయంతో, సత్సంకల్పంతో పురో హతుడికి దానం చేయాలి. దానం ఎప్పుడూ ధారాపూర్వ కంగానే చేయాలి. అంటే చేతిలో నుండి వదిలిన నీరు మళ్ళీ తనకు అందని విధంగా, దానం చేసే గోవులను కాని, వస్తువులను కాని, తన దగ్గరకు చేరకూడదనే, స్ఫూర్తితో, అర్ఘ్యంతో చేస్తారు. అర్ఘ్యం అంటే పుణ్యజలం. గోదానం ఇచ్చేముందు గోవును పేరు పెట్టి పిలవాలి. ”గోమాత నా తల్లి. వృషభం నా తండ్రి. వీటి గర్భప్రదేశం స్వర్గం అని మనసులోతలచుకొని దానం చేయాలి. గోదానం చేసిన వారు,
వారు చేసిన ఇతర దానాలు, పాపపుణ్యాల ఆధారంగా చంద్రలోకంలో కాని, గోలోకంలో కాని నివసిస్తారు. గోలోకానికి అధిపతి శ్రీ కృష్ణ భగవానుడే. ఆ లోకంలో కాలక్రమణం ఉండదు. ఋతువులు ఉండవు. ఆకలిదప్పికలుండవు. రోగాలు ఉండవు. ముసలితనం ఉండదు. అంతా శ్రీకృష్ణుని ధ్యాసే. గోదానం చేయడానికి అవసరమైన ధనం సక్రమసంపాదనే అయి ఉండాలి. ఈ మధ్యకా లంలో అక్రమార్జన చేసి ఆ పాపాన్ని కడిగేసుకోవడానికే దానాలు చేయడం పరిపాటయ్యింది. దీనివల్ల ఆ దానఫలితాలు పొందరు.
మనస్సుకు ఊరట మాత్రమే. గోదానానికి గోవుతో బాటు చిన్న దూడ ఉన్న గోవునే దానం చేయాలి. కపిల గోవు దానానికి మరీ శ్రేష్ఠం. ఇక్ష్వాకు వంశంలో సౌదాముడు అనే రాజు వశిష్టునితో ”మహర్షీ!దానాలలో కెల్లా ఏది గొప్పది?”అని అడి గితే,వశిష్టులవారు బదులిస్తూ ”రాజా! గోదానం విశేషమైనది. గోవు హూమ ద్రవ్యాలకు ఆధారభూతం. దేవతలందరూ గోవు లోని ప్రతీస్థానంలో నిక్షిప్తమై ఉన్నారు. జీవుల పోషణకు అవస రమైన ఆహారాన్ని పొం దాలంటే వ్యవసాయం చేయాలి. వ్యవసా యానికి, పాడిపంట లకు గోవు ముఖ్యం. గోవును కామధేనువు అం టారు అందుకే! అని చెప్పారు. సువర్ణ దానం వల్ల తరతరాలుగా ఆ వంశంలోని వారం దరికీ కల్మషం లేని బుద్ధి ప్రాప్తిస్తుంది.
హిరణ్య దానం
యజ్ఞయాగాదులలో, పితృకార్యాలలో సువర్ణ దానం చేయిస్తుంటారు. దేవతలకు ప్రీతి కలిగించేది ఈహరణ్య దానమే. పరశురాముడు వెదికివెదికి చాలామంది రాజులను సంహరిం చిన ప్పుడు ఆ పాపం పోగొట్టుకోడానికి అశ్వమేథయా గం చేసినా మాన సిక క్షోభ చల్లారలేదు. అప్పుడు వశిష్టులవారిని అడిగితే బంగారం అగ్నిమయం. దేవతలూ అగ్నిస్వరూపం. కనుక బంగారాన్ని దానం చేస్తే దేవతలకు ఇచ్చినట్లే! అని వేదాలు చెపుతున్నాయని వివ రించగా, పరుశరాముడు సువర్ణ దానం చేసి మనశ్శాంతిపొందా డు.
విద్యాదానం
పూర్వకాలంలో మహర్షులు అందరూ విద్యాదానం చేసినవారే. అందుకే యుగాలు గడుస్తున్నా, వారి కీర్తి శాశ్వతంగా ఉంది. ఉంటుంది. విద్యాదానం వల్ల జీవితంలో చీకటనేది ఉండదు. ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపినవారవుతారు. జ్ఞాన వంతులను తయారు చేసినవారవుతారు. శాశ్వత కీర్తిని పొందు తారు. ఎందరో విద్యాలయాలు, విశ్వ విద్యాల యాలు స్థాపిం చిన వారు ఎందరో ఉన్నారు. ఒకరు గాని సమూహంగా ఏర్పడి గాని నిస్వార్థ బుద్ధితో ఇటువంటివి ఏర్పాటు చేయాలి. ఉదాహర ణకు మల్లాడి సత్యలింగం నాయకర్ చొల్లంగి గ్రామస్థులు. నిరక్షరాస్యులు. ఆయన పడవల వ్యాపారం నిమిత్తం 1887 ప్రాంతంలో రంగూన్ వెళ్ళారు. అక్కడ అనేక కష్టాలను ఓర్చి, వ్యాపారంలో రాణించి, ఈ భూమి మీద తన పేరు శ్వాశ్వతంగా నిలవాలనే ఉద్దేశ్యంతో 1915లో ఎనిమిది లక్షల రూపాయలతో కాకినాడలో న్యాయవాది దురిశేటి శేషగిరిరావు, ఇంకా కొం త మంది బంధువులు, హితులతో 1915 లో ”మల్లాడి సత్య లింగం నాయకర్ ఛార్టీస్” అనే సంస్థను ఏర్పాటు చేసి విద్యాల యాలు, వేదపొఠశాల, అన్నదాన సత్రం వంటివి ఏర్పాట్లు చేసి వాటి అభివృద్ధికి కృషి చేసారు. ఇప్పుడు అక్కడి విద్యాలయం ప్రాధ మిక స్థాయి నుండి, యూనివర్సిటీ స్థాయి వరకు ఎదిగింది. ఈ విద్యాలయం ద్వారా కొన్ని లక్షలమంది విద్యావంతులై, కలక్టర్లుగా , డాక్ట ర్లుగా, సైం టిస్టులుగా, ఉపాధ్యా యు లుగా, ఎన్నో రంగాల్లో రాణించారు. దాదాపు 105 సం వత్సరాలు అయినా, ఆయన పేరు నిలబడే ఉంది. ఇలాగే గతంలో తెలు గు రాష్ట్రాలలో, ఇతరత్రా కూడా పాఠశాలల నిర్మాణా నికి భూములు విరా ళాలు ఇచ్చిన వారు ఎం దరో ఉన్నారు. ఈ సందర్భంగా వా రందరూ చేసిన మం చి కార్యక్ర మా లను తలచుకొంటూ కృతజ్ఞతలు తెలుపుకుందాం.
– ఎ. రంగారావు, 7989462679