మనం రామాయణం పేరు ఎత్తగానే , శ్రీరాముడు, సీతాదేవి, రావణాసురుడు వంటి వారు మదిలో మెదలుతారు. వైకుంఠ ద్వారపాలకులు జయ విజయలకు సనకస నందనాదులు ఇచ్చిన శాపం వల్ల రావణాసురుడు జన్మ వచ్చింది.
రామాయణంలో పవిత్రురాలు, ఎల్లప్పుడూ శ్రీరాముని సేవలోనే తరించే ఇల్లాలు, సీతాదేవిని లంకా పట్టణానికి ఎత్తుకుపోవడంతో రావణాసురుడు మనకు గోచరిస్తున్నాడు. ఆయన జన్మ విశేషాలు:—”సుమాలి” అనే రాక్షసుడు తన కుమార్తె కైకసితో ”పుత్రీ! నీకు వివాహం చేయవలసిన సమయం ఆసన్నమైంది. నువ్వు సమస్త సద్గుణాలతో లక్ష్మీదేవిలా కన పడుతున్నావు. కన్యతల్లి వంశము, తండ్రి వంశము, నీకు కాబోయే భర్త వంశం మూడు వం శాలను సర్వదా అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రజాపతి వంశంలో జన్మించినవాడు, పుల స్త్యుడు కుమారుడు విశ్రవసుణ్ణి సేవించు. వరించు ఆ కన్య తండ్రి మాటలు విని, తండ్రి యం దున్న గౌరవముచే విశ్రవసు తపస్సు చేస్తున్న చోటికి వచ్చి ఎదురుగా నిలబడింది. ఆ సమ యంలో విశ్రవసు ఘోరతపస్సు చేస్తూ, కాసేపటికి కళ్ళు తెరిచి, ఎదురుగా ఉన్న ఆమెను చూసి ”మంగళ ప్రదులారా! నువ్వు ఎవరి కుమార్తెవు? ఇక్కడికి ఎందుకు వచ్చావు” అని అడగ్గానే, ”ఓ! మహాముని! నా మనసులోని అభిప్రాయం ఏమిటో? మీ తప: ప్రభావం చేత తెలుసుకోండి. ఓ! బ్రహ్మర్షీ! నేను నా తండ్రి అనుమతితోనే ఇక్కడకు వచ్చాను. నా పేరు కైకసి.” అని మాత్రం పలికింది. కొద్ది సేపు ఆయన కళ్ళు మూసుకుని, ధ్యానం చేసి, ”ఓ! కుమారీ! నాకు నీ వలన పుత్రులు కలగాలని నన్ను కోరుకుంటూ వచ్చావు. నా వద్దకు దారుణ మైన సంధ్యా సమయంలో వచ్చావు. అందుచే నీకు భయంకరులు, క్రూరులు, బంధువులు యందు ప్రీతి కలవారు, రాక్షసులు పుత్రులుగా జన్మిస్తారు.” అన్నాడు.
వెంటనే కైకసి ”స్వామి! మనకు ఇటువంటి రాక్షసులు జన్మించడం ఇష్టం లేదు. అనుగ్ర హంచండి!” అనగానే ఆయన ”నా వంశానికి తగినవాడు ధర్మాత్ముడు ఆఖరి పుత్రుడు జన్మి స్తాడు” అనగానే సమ్మతించి, వివాహం జరిగింది. కొంతకాలానికి భయంకరుడు, క్రూరు డు, రాక్షస రూపంలో, నలుపు ఛాయతో, ఒత్తుగా ఉన్న జుట్టుతో పుత్రుడు జన్మించాడు. అత నికి పది కంఠాలు, ఇరవై చేతులు, పెద్దకళ్ళతో ఉన్నాడు. అపుడు ఆకాశం నుండి ఉల్కలు పడ్డాయి. భూమి అదిరింది. కుక్కలు అరుపులు. బ్రహ్మ దేవునితో సమానుడైన విశ్రవసుడు ఆ పిల్లవానికి ”దశ కంఠుడు” అనే పేరు పెట్టారు.
తరువాత తల్లి కోరిక మేరకు కుబేరుని అంతటివాడు కావాలని ఘోరమైన తపస్సు చేశా డు. ఆహారము లేకుండా గాలినే స్వీకరిస్తూ, వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు పదివేల సంవత్సరాల తపస్సులో ప్రతీ వెయ్యి సంవత్సరాలకు తన ఒక్కో తల నరికి అగ్నిహోత్రంలో సమర్పించేవాడు.
ఆఖరికి తొమ్మిది తలలు పూర్తిఅయి, పదవ తల తీసే సమయంలో బ్రహ్మ ప్రత్యక్షమై ”దశగ్రీవా! ధర్మము తెలిసినవాడా! నీ తపస్సుకు మెచ్చాను. ఏమి కావాలో కోరుకోమన్నా డు.” దశగ్రీవుడు సంతోషించి తలవంచి నమస్కరించి ”బ్రహ్మ దేవా! ప్రాణులకు మరణ ము తప్ప మరేదీ భయం కాదు. మృత్యువు కంటే శత్రువు లేడు. అటువంటి మృత్యువు లేకుం డా నన్ను అనుగ్రహంచు” అన్నాడు. బ్రహ్మ ”నీ కోరిక అసహజం. పుట్టిన ప్రతీ జీవి మరణిం చక తప్పదు కదా. మరేదైనా వరం కోరుకో” అన్నాడు.
ఆయన ప్రజాపతీ! నన్ను పక్షులు, నాగులు, యక్షులు, దైత్యులు, దానవులు, దేవతలు రాక్షసులు, చంపజాలకుండా వరం ఇవ్వమని కోరగానే తథాస్తు అని చెప్పి, నీ ఘోరమైన తపస్సుకు సంతృప్తి చెంది నీవు అగ్నికి ఆహుతి చేసిన తలలు మళ్ళీ నీకు ఇస్తున్నాను. అంతే కాకుండా నువ్వు ఏ రూపం కోరుకొంటావో, నీ ఇష్ఠానుసారం ఆ రూపం లభిస్తుంది. ఇది నా వరం. అంటూ వెళ్ళిపోయాడు. తరువాత దశకంఠుడు రాక్షస కృత్యాలతో దేవతలను, ఋషులను ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టాడు.
రావణాసురుడు పేరు పొందిన సంఘటన
—
తల్లి కైకసి ఒకసారి దశకంఠుడుతో నువ్వు కుబేరుడు అంతటి వాడవు కావాలి. అని పలి కింది. దాంతో కుబేరుడుపైకి దండెత్తి, యుద్ధం చేసి లంక నుండి తరిమి వేసాడు. అతని పుష్ప క విమానమును విజయ చిహ్నంగా అపహరించాడు. రావణాసురుడు తన సోదరుడైన కుబేరుని జయించి పుష్పక విమానము మీద తిరుగుతూ ఒక పర్వతం చూసి అక్కడికి రాగా నే, విమానం ఆగిపోయింది. ఇంతలో శివుని అనుచరుడు నందీశ్వరుడు అక్కడకు వచ్చి, రావణుని గుర్తించి, ”దశకంఠా! నువ్వు ఇక్కడనుండి వెళ్ళిపో! పర్వతము మీద పార్వతీదే వితో శివుడు క్రీడించుచున్నాడు. ఈ పర్వతం మీదికి పక్షులు, నాగులు, యక్షులు, దేవతలు, గంధర్వులు, రాక్షసులు ఇతర భూతాలు ఎవ్వరూ రాకూడదు.” అన్నాడు.
అపుడు దశకంఠుడు విమానం దిగి, ”శంకరుడు ఎవడు?” అంటూ పర్వతమూలం వద్దకు రాగా, శివుడులాగ నందిని చూసాడు. నందితో వాగ్వాదం అయిన తరువాత దశాన నుడు దేనివల్ల నా పుష్పక విమానం ఆగిపోయిందో, ఈ పర్వతాన్ని పెకలిస్తానని ప్రయత్నిం చాడు. ఇది చూసి పరమేశ్వరుడు కాలిబొటన వేలితో అనాయాసంగా పర్వతాన్ని నొక్కిపెట్టా డు. ఆ పర్వతం క్రింద పడి అతని చేతులు నలిగిపోయాయి.
భుజములు కూడా నలిగిపోతుంటే, రాక్షస రోషంతో మూడు లోకాలకు వినపడేలా గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు ఇంద్రుడు, దేవతలు యక్షులు అందరూ ఉలిక్కిపడ్డారు. అపుడు మహశ్వరుడిని స్తుతించి, ప్రార్థించగా, ఓ! రాక్షస రాజా! నువ్వు పర్వతం క్రింద నలిగి పోతూ, భీకరమైన శబ్దం చేసావు. ఆ ధ్వనికి మూడు లోకాలు భయపడ్డాయి. అందుచే నీకు ”రావణుడు” అని పేరు పొందుతావు. (రావ: అంటే ధ్వని) నువ్వు ఏ మార్గాన వెడదామను కొంటే ఆ మార్గం గుండా వెళ్ళవచ్చును.” అనగానే రావణాసురుడు ఒక వరం కోరాడు.
”నాకు రక్షణ కలిగించే ఆయుధాన్ని ఇమ్ము” అని. అపుడు ”చంద్రహా స”మనే ప్రసిద్ధి పొందిన ఖడ్గాన్ని, ఆయుర్దాయ శేషంలో అకాల మృత్యువు రాకుండా వరం పొందాడు.
వేదవతి శాపం:—రావణాసురుడు హమవత్పర్వతం ప్రాంతములో సంచరిస్తూ తప స్సులో ఉన్న ఒక దేవతా కన్యను చూసి మోహంతో ”నీవు నీ సౌందర్యానికి విరుద్ధంగా తపస్సు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావ”ని అడిగి, ఆమె కుజద్వజుడనే బ్రహ్మర్షి కుమార్తెగా తెలుసుకొని, విష్ణువు భర్తగా పొందాలనే కోరికతో తపస్సు చేస్తున్నట్లుగా తెలుసుకొని నన్ను వివాహం చేసుకొంటే, రాణివి అవుతావు. నా సంపదకు ఆధీనురాలవు. అనగానే ఆమె నిరాక రించింది. దాంతో ఆమె శిరోజాలను పట్టి బలవంతంగా లాగపోతే, అగ్నిని ఏర్పాటుచేసుకొ ని ”నీ చేత అవమానం పొందిన పిమ్మట జీవించడం అనవసరం. ఏనాటికైనా నువ్వు స్త్రీ కార ణంగానే మృత్యువు పొందుతావు.” అని ఆహుతైపోయింది.
ఆ అగ్ని బూడిద నుంచి ఒ క అందాల పాప పుట్టగా, ఆ పాపను తీసుకుని ఇంటికి వెళ్ళి ఆమె జాతకం, సాముద్రికం పరీక్ష వలన రావణాసురుడికి మరణమని గుర్తించి, ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో వదిలేశారు. కాలక్రమంలో జనక మహారాజు భూమి దున్నుతుండగా లభ్యమైనది. ఆమె సీతాదేవి. లంకాద#హనం ఒక స్త్రీ కారణం వల్లనే దగ్ధం అవుతుందన్న విష యం నిజమయ్యింది.