Saturday, November 23, 2024

దళితవాడలో ధర్మ ప్రచారం

పెద జొన్నవరంలో స్వాత్మానందేంద్ర పర్యటన
విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: హిందూ ధర్మ ప్రచారం కోసం కడప జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి మంగళవారం ప్రొద్దుటూరు, దువ్వూరు మండలాలను సందర్శిం చారు. అగస్త్యేశ్వర స్వామి, చెన్నకేశవ స్వామి ఆలయాలు, అమ్మవారి శాలకు వెళ్ళి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి పూజలు చేసారు. పెద జొన్నవరంలో విశాఖ శ్రీ శారదాపీఠం భక్తులు స్వామీజీకి బ్రహ్మరథం పట్టారు. దళితవాడలో కాలినడకన పర్యటించారు. దళితులు సొంత వ్యయంతో నిర్మించిన రామాలయాన్ని స్వామీజీ సందర్శించారు. సీతారాముల ప్రతిమలకు హారతులిచ్చి పూజలు చేసారు. హిందూ ధర్మం గొప్పతనం గురించి స్వామీజీ వివరించారు. కన్న తల్లి, జన్మభూమి, హిం దూ మతం ఒక్కటేనని అన్నారు. హిందూ ధర్మం ఒక మతానికి సంబంధించినది కాదని అది మానవుడి జీవన విధానమని చెప్పారు. సొంత ఖర్చులతో ఆలయాన్ని నిర్మించుకున్న పెద జొన్నవరం దళితులను అభినందించారు. సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పాటు-పడాలని, పెద జొన్నవరం దళితు లను ఆదర్శంగా తీసుకోవాలని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement