రావి చెట్టును త్రిమూర్తుల నిల యంగా, పరమ పవిత్రమై నదిగా భావిస్తారు. ఎందు కంటే ఈ చెట్టు కిందనే బుద్ధుడికి జ్ఞానో దయం అయిందని నమ్మకం. కాబట్టి, దీనిని ‘బోధి చెట్టు’గా సూచిస్తారు. సం ప్రదాయ భారతీయ సాహిత్యం రావి వృక్షాన్ని ‘అశ్వత్థ’ వృక్షంగా వర్ణిస్తుంది, రావి చెట్టును ఋగ్వేదంలో దేవు నిగా సూచించబడుతుంది, యజుర్వే దం ప్రకారం ప్రతి యాగములో అత్యం త ప్రామాణిక మైనదిగా పరిగణించ బడుతుంది. అధర్వణ వేదంలో అన్ని దేవతల నివాసంగా వర్ణించ బడింది.
”మూలతో బ్రహ్మరూపాయ
ధృతి విష్ణు రూపిణ,
అగ్రతో శివ రూపాయ,
వృక్ష రాజాయ నమోనమ:
అని మంత్రం.
మహాభారతంలో కృష్ణుడు తనను తాను రావి చెట్టుగా అభివర్ణించినాడు. (వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని భగవ ద్గీత) అందువల్ల పూర్వ కాలం నుండే రావి చెట్టు ఆరాధన వుంది. దేవాలయాల్లో రావి, వేప చెట్టు కలిసే ఉంటాయి. ”రావి” చెట్టుని శ్రీ ”మహావిష్ణువు”గానూ, ”వేప” చెట్టుని ”లక్ష్మిదేవి”గాను భావించాలని శాస్త్రా లు, వేదాలు చెపుతున్నాయి. ఈ జంట వృక్షాలను పూజించి, ప్రదక్షిణం చేయ డం ద్వారా అనేక దోషాలు తీరి దంపతు లు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందు తారు. రావిచెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతోంది. రావిచెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పూజింపబడుతోం ది. ఈ చెట్టుక్రిందే శ్రీ కృష్ణుడు చివరి దశలో ఈ చెట్టు క్రిందే విశ్రమించి వైకుంఠంకు చేరాడు. అందుకే శనివారం మాత్రమే ఆ చెట్టును తాకాలని పండితులు సూచిస్తు న్నారు. రావిచెట్టుకు బ్రహ్మదేవునితో కూడా సంబంధం ఉంది. చావు పుట్టు కలు లేని బ్రహ్మదేవుడు మరణించిన వారి ఆత్మలను తనలో కలుపుకునే చెట్టు గా రావి చెట్టు ఉన్నది. రావి చెట్టు కింద కర్మ క్రతువులను జరుపుటకు కూడా కారణం ఇదే. రావి చెట్టు ఎన్నడూ ఒకేసారి ఆకు లను జార విడువదు. ఆకులు పడిపోయే కొలదీ కొత్త ఆకులు చిగురిస్తూ నూతన జన్మను తీసుకొంటాయి. ఇది జన్మ, మరణ చక్రం అని సూచిస్తుంది. అందు వలన దీనిని ఆధ్యాత్మిక వాస్తవికతకు సంబంధించిన చెట్టుగా భావిస్తుంటా రు. కొందరి నమ్మకాల ప్రకారం ఈ భూమి మీద ఉన్న ప్రతి రావి చెట్టు ఆకు ఒక ప్రాణంగా చెప్పబడుతున్నది. రావి చెట్టు ఎన్నటికీ చనిపోదు. అది శాశ్వతంగా ఉంటుంది. దాని శాశ్వ త స్వభావం కూడా శాశ్వతాత్మతో సం బంధం కలిగి ఉంటుంది. ఇది శాశ్వత మై మరణం లేనిదిగా ఉంటుంది. శని దోషం ఉన్న వారు రావి చెట్టుకి పూజ చేయాలి. నమస్కరించి, కౌగిలిం చుకుంటే అనేక దోషాలు పోతాయి. బుద్ధగయలోని బోధివృక్షం క్రీ.పూ.288 నాటిదని అంచనా వేశారు. (పుష్పించే వృక్షాలలో వయసు అంచనా కట్టబడిన వాటిలో ఇది అత్యంత పురా తనమైనది కావచ్చును). భారత దేశం, నేపాల్, దక్షిణ చైనా, ఇండో చైనా ప్రాం తాలలో ఈ చెట్టు అధికంగా పెరుగు తుంది. పొడి ప్రాంతాలలోనూ, తేమ ప్రాంతాలలోనూ పెరిగే పెద్ద చెట్టు. ఇది సుమారు 30 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండం వ్యాసం 3 మీటర్ల వరకు పెరుగుతుంది. త్రిమూర్త్య నిల యమైన రావిచెట్టు ను పూజిద్దాం.
– ఎస్.రామకిష్టయ్య
9440595494
త్రైమూర్త్య నిలయం… అశ్వత్థ వృక్షం
Advertisement
తాజా వార్తలు
Advertisement