Saturday, November 23, 2024

త్రిశక్తి స్వరూపం హనుమ!

జైజైజై హనుమాన గొసాఈ|
కృపాకరహు గురుదేవ కీ నా ఈఁ||

జితేంద్రియుడైన హనుమకు నిత్య మూ జయమే. ఆయన మనకు గురుదేవు డు. ఆయన కృప మనకు సులభ లభ్యమే. సర్వేంద్రి యాలను జయించి, జయించిన ఇంద్రియాలతో సంచలించే హనుమ, మన మనసును కూడా నిగ్రహించగల ధీరోదా త్తుడు. ఇంద్రియ నిగ్రహానికి కావాల్సిన సాధనా మార్గాలను హనుమ మనకు విశదపరిచి, అధ్యాత్మ వైపు నడిపిస్తాడు. నడు స్తూ, నడిపించే వాడే గురువు. ఆచరించేవాడు ఆచార్యుడు.
వ్యక్తి శాంతిని, లోక శాంతిని, సర్వలోక శాంతిని అను గ్రహించగల వరిష్టుడు హనుమ! త్రికాల ములలోనూ, మూడు అవస్థలలోనూ జాగృతం చేయగల వాతాత్మజుడు, హనుమ! ఆయనకు జయత్రయాభి వందనం చేయటం సాధకుడి కర్త వ్యం. దేవ అంటే ఆట. దైవం అంటే ఆడించేవాడు, ఆడే వాడు. ”దేవోభూత్వా దేయం యజేత్‌! భగవత్తత్వాన్ని పూర్ణంగా అను భవించి, దైవభావనను తన భావనగా తీర్చిదిద్దుకున్నవాడే దైవాన్ని గురించి చెప్పగలడు. దైవం వలె ప్రవర్తించగలడు. దైవం అంటే అంతర్గత శక్తి. అవ్యయ శాంతి. ఇంకొకరి కష్టాన్ని తృటిలో తీర్చగల దయాళువు. మార్గ దర్శి, అంతశ్చేతన హనుమ! కనుకనే ఆయన సర్వాత్మ. గురు వు, దైవం, ఆత్మ నిజానికి ఒకటే! హనుమ త్రిశక్తి స్వరూపం! జితేంద్రియుడు కనుక గొసాయి!

– వి.యస్‌.ఆర్‌.మూర్తి
9440603499

Advertisement

తాజా వార్తలు

Advertisement