ప్రతీ సంవత్సరం ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు మనందరం ”వ్యాసపూర్ణిమ”గా పాటిస్తూ, వ్యాసమ#హర్షి యొక్క గొప్పతనాన్ని గుర్తుచేసుకొంటాము. ఆయన విష్ణు అంశ శంభూతుడు. కలియుగంలో మానవులు అనుసరించవలసిన ధర్మార్థ, కామ, మోక్ష, సాధనాలకు, ఉత్తమ మార్గాలను, భగవత త్త్వం వంటి మ#హత్తర మైన సాధనాలను, సందేశాన్ని సమ కూర్చిన ”పంచమవేదం” అనే మహాభారతాన్నే కాకుండా అష్టాదశ పురాణా లను, శ్రీ కృష్ణావతార ర#హస్యాన్ని, ఆయన లీలలతో కూడిన భాగవ తాన్ని, ఈ లోకానికి అందించిన దివ్య ఋషి, జగద్గురువు. అందుకే ఆ పూర్ణిమను కూడా ‘గురు పూర్ణిమ’గా పాటిస్తున్నాము. ఆ రోజు వ్యాస భగవానుడు జన్మించిన రోజు.
భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునికి తన విభూతు లను (స్వరూపాలు) వివరిస్తూ ”ముని నామప్య#హం వ్యాస:, కవీ నాం ముశనా కవి:” అంటే పరమతత్త్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని, వ్యక్తం చేసే సామర్థ్యం ఉన్న వ్యాసమునిని నేనే!” అన్నాడు. అందుకే భీష్మా చార్యులు అంపశయ్య మీద ఉన్నరోజుల్లో ధర్మరాజుకు బోధించిన విష్ణు సహస్రనామావళి, ప్రార్థనా శ్లోకాలలో ”విష్ణు. రూపాయ వ్యా సవే, వ్యాస రూపాయ విష్ణవే” అని తెలియచేసాడు. అలాగే, దాని క్రింద శ్లోకంలో తన కుటుంబ ప్రవర తెలిపారు.
”వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే: పౌత్రమ కల్పషమ్!
పరాశరాత్మజం, వందే శుకతాతమ్ తపోనిథి!!
వశిష్ఠ మ#హర్షి మునిమనవడు, శక్తిముని పౌత్రుడు, పరాశు రుడి కుమారుడు, శుకుడుకు తండ్రి అయినవాడు వ్యాసుడు.
వ్యాసమ#హర్షి జననం
మత్స్యగంధి తండ్రి దాశరాజు ఆజ్ఞ ప్రకారం యమూనా నదిలో పడవ నడుపుతోంది. ఈమెకు మరోపేరే సత్యవతి. ఆమె చక్కని శరీర సౌష్ఠవంతో, సౌందర్యంతో పెద్దపెద్ద కళ్ళతో ఉన్నందు వల్ల పరాశర మహర్షి మోహించి, మనసులోని కోరిక వెళ్ళడి అయ్యేటట్లుగా, ఆమెతో మాట్లాడాడు. అపుడామె భయపడి ”నేను. జాలరిదాన్ని. నా శరీరం చేపల వాసనతో కూడింది. ఓ దివ్య ఋషీ! నేను కన్యను, నా కన్యాత్వం అంతరిస్తే నా తండ్రి అంగీకరించడు. నాకు ఏదోషం కలుగకుండా అనుగ్రహించండి” అని కోరింది. అపు డా పరాశర మహర్షి సంతోషించి, ”నాకు ప్రియంచేసినందుకు ఏ కన్యాత్వం చెడదు. నీవు వసురాజు వల్ల జన్మించిన దానవు. అని ఆమె జన్మ రహస్యాలను తెలిపి, ఆమె శరీరాన్ని సుగంధ పరిమళం చేసి, సమస్త జనుల దృష్టిని మరల్చేందుకు మంచు చీకట్లను కల్పించాడు. బ్రహ్మ సమానుడైన పరాశర మహర్షి సంగమంతో, మనోహర రూపంతో, మంచి విద్వత్ కలిగిన తత్కాల గర్భమం దు, సూర్య సన్నిభుడు, వేదమయుడు, వేదవ్యాసుడు జన్మించా డు. ఆ యమునా ద్వీపంలో కనుచీకట్లో పుట్టినందువల్ల నల్లని శరీరఛాయతో, కృష్ణ ద్వైపాయనుడు పేరు వచ్చింది. పుట్టగానే తపో మార్గంలో మనసు నిలిపాడు. సత్యవతి కోరిక మేరకు వరాలు ఇచ్చి, పరాశర మహర్షి వెళ్ళిపోయాడు. కృష్ణ ద్వైపాయనుడు కూడా జింక చర్మధారై, ఎర్రని జడలతో, దండ. కమండలాలను ధరించి, తల్లికి నమస్కరించి, ”మీరు పని కలిగినపుడు, నన్ను తలస్తే నేను మీ ముందుకు వస్తానని” చెప్పి, వేదవ్యాసుడు తపోవనానికి బయలుదేరారు. ఆయన ఒకే వేదంగా ఉన్నదానిని, నాలుగు వేదాలుగా విభజించాడు. అందువల్లనే వేదవ్యాసుడు అయ్యాడు. పంచమ వేదం అయిన మహాభారతం రచించాడు. దానిద్వారా ఎన్నో ధర్మసూక్ష్మాలు, కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం వంటి మార్గాలను మనకు అందించారు. అష్టాదశ పురాణాలను అందించాడు. అయినా ఆయనకు తృప్తి కలుగలేదు. ఒకసారి ఆశ్రమానికి వచ్చిన నారద మహర్షిని ”మహర్షీ! నారదా! నేను ఇన్ని పురాణాలను, మహాభారతాన్ని రాసినా నాకు సంతృప్తి కలగడం లేదు. ఏమిటి కారణం” అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి ”లోకహితం కోసం చాలా అందించారు. కాని పరమాత్మ లీలలను అందించలేదు ఆందించమ”ని సలహా ఇవ్వగా, వేద వ్యాసుడు భాగవతం అనే గ్రంథాన్ని రాసి సంతృప్తి చెందాడు.
ఈయనకు నైమిశారణ్యంలో ఒక ఆశ్రమం, మనభారతదేశం నేపాల్ సరిహద్దు గ్రామం వద్ద హిమాలయాల్లో ఒక ఆశ్రమం, ఋషికేశ్ నుండి కేదార్‌నాథ్‌కు వెళ్ళేమార్గంలో సరస్వతి- అలక నంద నదుల సంగమ ప్రాంతంలో మరో ఆశ్రమం ఉన్నాయి. వ్యాస మహర్షి తాను విభజించిన నాలుగు వేదాలను తన ప్రియ శిష్యుల ద్వారా ఈ జగత్తుకు అందేటట్లు చేసాడు. ప్రధాన శిష్యు డు వైశంపాయనుడి ద్వారా యజుర్వేదం ( కృష్ణ, శుక్ల అనే రెండు భాగాలు), ఋగ్వేదాన్ని పైలుడు అనే శిష్యునకు, సామవేదాన్ని జైమిని అనే శిష్యునకు, అధర్వణవేదం సుమంతుడు అనే శిష్యుల కు బోధించి పంపాడు. తను రాసిన అష్టాదశ పురాణాలను ”రోమ హర్షణుడు” అనే ఋషికి బోధించాడు. మన వేదాలు, సంస్కృతి గురువును త్రిమూర్తి స్వరూపుడుగా అభివర్ణించాయి. అందుకే-
”గురు బ్రహ్మ, గురు విష్ణు: గురుర్థేవో మహశ్వర:
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమ:!”
గురువు అంటేనే అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగు లోకి తెచ్చి, జీవితానికి గమ్యం చూపేవాడు. ఆదిశంకరాచార్యులు వారు శ్రీ కృష్ణ పరమాత్మను ”జగద్గురువు”గా స్తుతించారు. ఆ శంక రులే నర్మదానది ఒడ్డున ఆశ్రమ జీవితం గడుపుతున్న ”గోవింద భగవత్పాదుల వారివద్ద, శ్రీ కృష్ణుడు సాందీప మహర్షి వద్ద, శ్రీరా ముడు వశిష్ఠ విశ్వామిత్రుల వద్ద, ద్వైతమత ప్రబోధకులు శ్రీ రామానుజాచార్య కంచిలో ఉన్న శ్రీ యాదవ ప్రకాష్‌గారి వద్ధ శిష్య రికం చేసారు. ఈ గురుపూర్ణిమ రోజు షిరిడీలో సాయిబాబా గుడి లో మూడురోజులపాటు ఈ గురుపూర్ణిమ ఉత్స వాలు నిర్వహిస్తా రు. ఎందుకంటే సాయి ఎందరికో ఆరాధ్యుడు. శ్రద్ధ, ఓర్పు అవసర మని, తన దగ్గరకు వచ్చిన వారికి భక్తితత్త్వాన్ని, జ్ఞానతత్త్వాన్ని ప్రబోధించిన గురువు. మన గురువులను, వ్యాస మహర్షిని, పైన తెలిపిన గురువులందరినీ తలచుకోవడం, స్తుతించడంమన ధర్మం.
– అనంతాత్మకుల రంగారావు
7989462679