Saturday, November 23, 2024

త్రిదేహాలంటే…

మానవులకు మూడు దేహాలుంటాయని మన ఆధ్యాత్మిక వాఙ్మయం చెబుతోంది. అవి స్థూల సూక్ష్మ కారణ దేహాలు. అవి ఏమిటో వాటి ధర్మాలు ఏమిటో కూడా మన వాఙ్మయం తెలిపింది. అవేమిటో చూద్దాం.
స్థూల దేహం
స్థూల దేహము అనగా ఇది కర్మజన్యమైనది. శుక్ల శోణితోద్భవమైనది. సప్త ధాతుమయమైనది. జడమై, అన్నరసోద్భవమైనట్టిది. దీనినే పాంచభౌతిక దేహము అనవచ్చు.
దాని ధర్మాలు
ఇది జాతి, బ్రహ్మచర్యాది ఆశ్రమములు, రూపములు, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యములు కలది. జనన, మరణములు, ఆకలి దప్పికలు, సుఖ దు:ఖములు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు మొదలగు గుర్తింపుతో కూడి ఉన్నది. ఇది అన్నమువలన పుట్టినది. అన్నము వలన పెరుగునది. అ న్న భూ తమునందు లయమవునది. కనుక దీనికి అన్నమయ కోశ మని పే రు. ఇది జాగ్రదవస్థయందే తోచును. ఇది శరీర సుఖ దు:ఖ భోగ ములకు సాధనము. రెండు, కాళ్ళు, రెండు చేతులు కలిగినది. నేత్రా లకు కనబడుతున్న పరిమిత, జడ స్థూల దేహము ఆత్మ కాదు. స్వ ప్నమందు ఈ ధర్మములు ఈ దేహానికి లేవు కనుక ఇది ఆత్మ కాదు.
సూక్ష్మ దేహం
సూక్ష్మ శరీరమనగా సకలేంద్రియములు అనగా చెవులు, చ ర్మం, నేత్రం, నాలుక, నాసికం, జ్ఞానేంద్రియములు ఐదు. నోరు, కర ము, చరణము, మర్మస్థానం, మల స్థానం కర్మేంద్రియాలు ఐదు.
సమాన (నాభి), వ్యాసం ( సర్వ శరీరం), ఉదానం ( కంఠం), ప్రాణ ( హృదయము), అపానం( గుదము) ఈ ఐదు పంచ ప్రాణములు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను అంతరేంద్రియములు నాలుగు. ఈ పంతొమ్మిది అంశలతో కూడియున్నది సూక్ష్మ శరీరము.
ధర్మాలు
వచన, దాన, గమనాగమన, ఆనంద, విసర్జన, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, పచనము చేయుట, సర్వ శరీరమందు వ్యాపించుట, మ్రింగుట ఉచ్ఛ్వాస, నిశ్వాస, సంకల్ప, వికల్ప, నిశ్చయ, చింతనందు అభిమానము ఈ సూక్ష్మ శరీర ధర్మములు.
ఇందు మూడు కోశములు కలవు. అవి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు.
పంచ వాయువులైదును చేరితే ప్రాణమయ కోశము.
విజ్ఞానమయ కోశమనగా శబ్దముతో కూడిన శ్రోత్రేంద్రియము, స్పర్శతో కూడిన త్వగింద్రియము. గంధముతో కూడిన ఘ్రాణీంద్రియము విషయ పంచకముతో కూడిన అంతరేంద్రియములలోని బుద్ధిని చేరి విజ్ఞానమయ కోశమౌ తుంది. దీని అవస్థ స్వప్నావస్థ. సూక్ష్మ శరీరము కూడ ఆత్మ కాదు.
కారణ శరీరం
అనాది, అనిర్వచనీయము, అవిద్య అనెడి అజ్ఞానమే కారణ శరీరం. దీనికి ఆనందమయ కోశమను పేరు ఉంది.
ధర్మాలు
దీని ధర్మము ప్రియ, మోద, ప్రమోదములనెడు చిత్త వృత్తులను కలుగజేయును. ప్రియమనగా ఒక దానిని చూచినప్పుడు కలుగు ఆనందము. మోదమనగా ఆ వస్తువు తనకు లభించినప్పుడు కలుగు ఆనందము. ప్రమోదమనగా ఆ వస్తువును తాను అనుభవించినప్పుడు కలుగు ఆనందము. అజ్ఞానమే ప్రధానముగాగల అవిద్యా మూలముగానున్న అంత:కరణమే ఆనందమయ కోశమన బడును.
దీని అవస్థ సుషుప్తి (మెల కువ), కారణ శరీరము ఆత్మ కాదు.
సర్వేజనాస్సుఖినోభవంతు

కోసూరు హయగ్రీవరావు
99495 14583

Advertisement

తాజా వార్తలు

Advertisement