Saturday, November 23, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలు : చిన్న శేషవాహన సేవ (ఆడియోతో…)

2. చిన్న శేషవాహనం సేవ ఆంతర్యం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజార్యుల వారి వివరణ

ధ్వజారోహణం తెల్లవారి ఉదయం మలయప్ప స్వామి చిన్న శేష వాహనం పై నాలుగు మాడ వీధులలో విహరిస్తారు. చిన్న శేషుడు అనగా శేషుని తమ్ముడు వాసుకి. ఈ వాసుకి శ్రీమన్నారాయణుని ఆజ్ఞతో క్షీరసాగర మదన సమయంలో మందర పర్వతానికి కవ్వపు తాడుగా మారి సముద్రాన్ని చిలకడానికి సహాయం చేశాడు. స్వామి ఆజ్ఞతో తన పడగల నుండి అనగా ముఖముల నుండి విషజ్వాలలు చిమ్ముతూ రాక్షసులను మూర్ఛాక్రాంతులను చేశాడు. తన విషమును సముద్రమున ఉద్గారం(వాంతి) చేసి సముద్రంలో హాలాహలం పుట్టడానికి తన వంతు సేవ చేసి శంకరునికి ఆ హాల హలాన్ని పానం చేసి లోకాలను రక్షించే అవకాశాన్ని ఇచ్చి దానికి కృతజ్ఞతగా శంకరుని చేతికి కంకణమైనాడు. తన చెల్లె లైనా ‘జగత్కారు’ ని ‘జగత్కారు’ అనే మహర్షికి ఇచ్చి వివాహం చేసి బ్రహ్మ ఆజ్ఞను పాటించి ఆ దంపతుల సంతానమైన ఆస్తీకునితో జన్మయజయుడు ఆచరించిన సర్పయాగాన్ని నివారించి అఖిల నాగులకు జీవితాన్ని ప్రసాదించిన మహానుభావుడు ‘వాసుకి’. అందుకే మలయప్ప స్వామి వాసుకికి రెండవ సేవా భాగ్యాన్ని ప్రసాదించాడు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు,
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement