Saturday, November 23, 2024

తిరుమలలో కార్తీక శోభ

తిరుమల ప్రభన్యూస్‌ ప్రతినిధి: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం సాయంత్రం కార్తీక పర్వదీపోత్సవం ఘనంగా జరిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తి అయిన తర్వాత ఈ దీపోత్సం నిర్వహించారు. ఈ కార్తీక పర్వదీపోత్సవంలో మొదట శ్రీయోగనరసింహస్వామి ఆలయం పక్కన ఉన్న పరిమళం అర దగ్గర కొత్త మూకుళ్ళలో నేతి ఒత్తులతో దీపాలను వెలిగించారు. ఆ తర్వాత వీటిని ఛత్రఛామర మంగళవాయి ద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి మూలమూర్తికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపా లకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళా మాత, బంగారుబావి, కళ్యాణ మండపం, సబేరా, తాళ్ళపాక వారి అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విశ్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమల రాయమండపం, పూల బా వి, రంగనాయక మండ పం, మహాద్వా రం, భేడి ఆంజనేయస్వామి, శ్రీవరా హ స్వామి ఆలయం, స్వా మి పుష్కరిణి వద్ద నేతి దీ పాలను ఉంచారు. ఈ కార్తీ క దీపోత్సవంలో పెద్ద జీ యర్‌ స్వామి, ఆలయ డిప్యూటిఈవో రమేష్‌ బా బు, పేష్కార్‌ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement