Friday, November 22, 2024

తిరుమలకు పేటీఎం వ్యవస్థాపకుడు

న్యూఢిల్లి : పేటీఎం వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) విజయ్‌ శేఖర్‌ శర్మ సోమవారం తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భారతదేశ ఐపీఓ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా పేటీఎం రాబోతోంది. సోమవారం నుంచి సబ్‌ స్క్రిప్షన్‌ ప్రారంభమైం ది. ఈ మేరకు దేవుని ఆశీర్వాదం పొందడానికి ఆలయాన్ని సందర్శించారు. ఐపీఓ ద్వారా రూ.18,300 కోట్లు సమీకరించేందుకు పేటీఎం సిద్ధపడుతున్నది. ఫుడ్‌ డెలివరీ దిగ్గజం జొమాటో జులైలో ప్రారంభ ఐపీఓ కింద రూ.9,375 కోట్లు సేకరించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. పేటీఎంకు చైనీస్‌ టైకూన్‌ జాక్‌ మా యాంట్‌ గ్రూప్‌, జపాన్‌ సాఫ్ట్‌ బ్యాంక్‌, వారెన్‌ బఫెట్‌ బెర్క్‌ షైర్‌ హాత్‌వే మద్దతు ఉంది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత.. విజయ్‌ శేఖర్‌ శర్మ ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. తాను పేటీఎం కుటుంబానికి దేవుని ఆశీర్వాదం పొందడానికి తిరుపతికి వచ్చినట్టు తెలిపారు. దర్శనంలో భాగంగా తిరుపతిలో టీటీపీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జవహర్‌ రెడ్డిని కలిసినట్టు వివరించారు. ఈ మేరకు ఓ ఫొటోను కూడా పోస్టు చేశారు. పేటీఎం ఐపీఓ సబ్‌ స్క్రిప్షన్‌ సోమవారం ప్రారంభమైంది. రేపటితో ముగుస్తుంది. కంపెనీ మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ తీసుకొచ్చిన అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. ఒక్కో షేరు రూ.2080 నుంచి రూ.2150గా నిర్ణయించారు. ఒక లాట్‌లో ఆరు షేర్లు ఉంటాయి. ఓ లాట్‌ దరఖాస్తు చేయడానికి రూ.12,840 పెట్టుబడి కావాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement