తిరుపతి : కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలోని చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం, శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 20 నుండి జూలై 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో ఈ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రెండు అలయాల్లో వేరువేరుగా ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజ పటం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహనసేవలు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement