తిరుమల, ప్రభన్యూస్: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్య కార్యదర్శిగా జవహర్‌రెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఉదయం 10.05 గంటలకు టీటీడీ అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో బోర్డు సభ్యులకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం కాఫి టేబుల్‌బుక్‌ను అదనపు ఈవో అందించారు. అనంతరం ఆలయం వెలుపల ఈవో విలేకరులతో మాట్లాడుతూ తిరుల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 7 నుంచి 15 వ తేది వరకు నిర్వహిస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.ఇది వరకు ప్రకటించినట్టుగానే అంజనాద్రిలో హనుమాన్ జన్మస్థలాన్ని అభివృద్ది చేస్తామని తెలిపారు. నూతంగా బాణీలు కట్టిన అన్నమయ్య సంకీర్తనలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా అక్టోబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా యువతకు పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలన
అ తరువాత అదనపు ఈవో, సివిఎస్‌వోతో కలసి బ్రహ్మోత్స వాల ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. ఆలయంలో భక్తుల ప్రవే సించే, వెలుపలికి వచ్చే క్యూ లైన్‌లు, పారిశుధ్యం, విద్యుత్ అలం కరణ ఏర్పాట్లు, సివిల్ పనులను తనిఖీ చేశారు. నిర్దేశిత సమయం లోపు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. ఈవో వెంట చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఈఈలు జగన్‌మోహన్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, విజివో బాలిరెడ్డి తదితరులు ఉన్నారు.
టీటీడీ బోర్డు కార్యదర్శిగా జవహర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
Advertisement
తాజా వార్తలు
Advertisement