అమరావతి, ఆంధ్రప్రభ: తిరుమల తిరుపతి దేవస్థానం జంబో నియామకా లపై హైకోర్టు నేడు (బుధవారం)విచారణ జరపనుంది. పాలక మండలి సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితుల నియామకం ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై వాదనలు జరగనున్నాయి. మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కు మార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరుపు న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్ ప్రస్తావించారు. లంచ్ మోషన్ రూపంలో వేసిన ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని కోర్టును అభ్యర్థించారు. అయితే ధర్మాసనం అందుకు నిరాకరించింది. ఇందులో అత్యవస రమైన అంశం ఏముందని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన అశ్వనీకుమార్ సభ్యు లంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారని అందువల్ల తక్షణం విచారణ జరపాలని కోరారు. అయినా ధర్మాసనం ని రాకరిస్తూ బుధవారమే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. హిందూ జనశక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కాకుమాను లలిత్‌కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కూడా విచారించాలని ఆయన తరుపు న్యాయవాది ఉమేష్‌చంద్ర ధర్మాసనానికి నివేదించారు. వ్యాజ్యానికి నెంబర్ ఇచ్చి ఉంటే జరుపుతామని ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement