Friday, November 22, 2024

టీచరుగా కావడము (ఆడియోతో…)

ఇతరులకు నేర్పించడము సూక్ష్మంగా చాలా బాగా జరుగుతుంది. హృదయం అర్థం చేసుకుంది కాబట్టి నీవు ఇచ్చే వివరణ ఎదుటివారి మనసులను తెరిపిస్తుంది.

నేర్పించాలి అన్న లక్ష్యం కన్నా ప్రేరణ ఇవ్వాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకో. నువ్వు ఎవరికైతే నేర్పిస్తున్నావో వారి పట్ల నీకున్న ప్రేమ అది చేస్తుంది. భగవంతుని పట్ల నీకున్న ప్రేమ అది చేస్తుంది. నేర్పించే సమయంలో నువ్వు ఎంతగా ఆత్మిక స్థితిలో ఉంటావో అంతగా ఎదుటివారు దానిని అనుభవం చేసుకోగలరు. ఆధ్యాత్మిక పురుషార్థాన్ని చెయ్యమని ఎప్పుడూ ఎవ్వరినీ బలవంతం చెయ్యకు. మనసు తెరుచుకున్నప్పుడు ఇది సహజంగా జరిగిపోతుంది. పోల్చుకోవడం మానుకో. అది నిరాశను కలిగిస్తుంది. చెడు భావనకు చోటు ఇవ్వకు. నిన్ను నువ్వు గొప్పగా చూపించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకు. ఒక బిడ్డ ఎదగడానికి తల్లిదండ్రులు ప్రేమ దోహదపడుతుంది. అటువంటి తల్లిదండ్రిగా వ్యవహరించు.
-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement