Friday, November 22, 2024

జీవన నాటకము – 1 (ఆడియోతో…)

గడుస్తున్న ప్రతి క్షణము నాటకంలో జరిగే పాత్‌ వంటిది. ఈ జీవన నాటకంలో మన పాత్రలను చక్కగా పోషించే పాత్రధారులం మనమందరము. ఒక నిజమైన పాత్రధారి ఇతరుల పాత్రను నిరంతరం విమర్శనాత్మకంగా చూడడు, అతడు కేవలం తన పాత్రను ఎంత చ క్కగా పోషించగలిగితే అంత చ క్కగా చేసుకుంటూ వెళ్తాడు. ఈ జీవన నాటకం అనంతమైనది, నిశ్చితమైనది మరియు ఖచ్చితమైనది. ఎవరు ఏది మాట్లాడుతున్నా, చేస్తున్నా అది వారి పాత్ర, మనది కాదు. మన పాత్రను చక్కగా పోషించడమే మన పాత్ర.

సరైన ఆలోచనలు ఈ నాటకానికి మంచి మార్గాన్ని తీసుకువస్తాము. నీ పాత్ర నుండి ఉప రామంగా ఉండటం నేర్చుకో, ఆ పాత్ర వెనుక ఉన్న యథార్ధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు నిన్ను నువ్వు ప్రతి క్షణం ప్రేమించుకుంటావు, నాటకాన్ని కూడా. ” ఇది ఎందుకు జరిగింది ” అన్న ప్రశ్నకు నీకు అప్పుడు సమాధానం దొరుకుతుంది.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement