Saturday, November 23, 2024

జన్మచేత కాదు వర్ణం… కర్మ చేతనే…

బ్రాహ్మణులుగా పూజించబడుతూ… యజ్ఞ యాగాలలో నేటికీ హవిర్భాగములు కూడా అందుకుంటు-న్న బ్రాహ్మణతరులు (వజ్రసూచికోపనిష త్తు ప్రకారం) ఋష్యశృంగుడు.. జింకలు పట్టు-కునే జాతులకు పుట్టినవాడు. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు. జంబూక మహర్షి .. నక్కలు పట్టు-కునే జాతివారు.. వాల్మీకి.. ఓ కిరాతకుల జాతికి చెందినవాడు. ఈతను రచించిన రామాయణం.. హిందువులకు పర మ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆది కవిని చేసి పూజి స్తారు. వ్యాసుడు .. ఓ చేపలు పట్టే బెస్త జాతికి చెందిన వాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదాలను విభజించి వేద వ్యాసుడయ్యాడు. గౌతముడు.. కుందేళ్లు పట్టే జాతికి చెందినవాడు. వశిష్టుడు.. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుం ధతీదేవి. ఈరోజుకు నూతన దంపతులచేత అరుంధతీ వశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయం వుంది. ప్రతి పూజలోనూ హిందు వులచేత.. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమ:.. అని పూజలందుకుంటు-న్నారు. వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత. ఛండా లాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్త వనిత మత్స్య గంధిని వివాహమాడి వ్యాసు ణ్ణి కన్నారు. అగస్త్యుడు.. మట్టికుండ ల్లో పుట్టినవాడు. మాతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారు డు. బ్రాహ్మణుడయ్యాడు. అతని కూతురే మాతంగ కన్య. శక్తి దేవ త. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపా సించారు. ఈమే శ్యామలాదేవి.
ఐతరేయ మహర్షి ఒక దాస్యుడు, కిరాతకుడి కుమారుడు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయోపనిషత్తు. ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదం మీద రిసెర్చ్‌ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులుతమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరు, తండ్రి ఎవరో తెలియదు. జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.
ఉన్నత వంశాలలో పుట్టినవారిని కూడా వారి ధర్మం నిర్వర్తిం చకపోతే వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు. వారిలో కొందరు భూదేవి కుమారుడు, క్షత్రియుడైన నరకుడు రాక్షసుడై నాడు. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావ ణుడు బ్రాహ్మణులైనా రాక్షసులయ్యారు. రఘువంశ మూల పురు షుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు ప్రవిద్ధుడు రాక్షసు డైనాడు. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలుడు అయ్యాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడు బ్రాహ్మణుడైనాడు. వీరి వంశస్తులే కౌశి కస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొంద రు శూద్రులయ్యారు. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమా రుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారి పోయాడు. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరు మీదే ఇతని వంశ బ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది. శౌనక మహర్షి కుమారులు నాలుగు వర్ణాలకు చెందిన వారుగా మారారు అలాగే వీతవ్యుడు, వృత్సమతి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెం దినవారయ్యారు. వీరిలో చాలామంది వేద మంత్రాలు రచించారు. హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడినది కానీ, జన్మం వి dుద కాదు .
– డా|| చదలవాడ హరిబాబు
98495 00354

Advertisement

తాజా వార్తలు

Advertisement