హిందూ సంప్రదాయంలో, ధర్మంలో అందరూ ఆదరిస్తూ ఆచరించే పవిత్ర గ్రంథం ‘దుర్గా సప్తశతి.’ ఇందులో భగవతి, జగన్మాత, భగవతి దుర్గాదేవి కృపను విశద పరిచే విషయాలు, దుర్గను ఆరాధించి, అర్చించే విషయాలు అనం తంగా శ్లోక రూపంలో ఉం టాయి. ఇది చక్కని ఇతి హాసం. ఇందులో నిగూఢ సాధనా రహస్యాలు ఎన్నో నిండి వున్నాయి.
కర్మ- భక్తి- జ్ఞానము ల త్రివేణీ సంగమం. దుర్గా దేవి భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువు. సకామ భక్తు లు దుర్గాదేవిని సేవించి తమ అభీష్టాలను పొందు తున్నారు. నిష్కాములైన వారు దుర్లభమగు మోక్షమును పొంది కృతార్థులవుతున్నారు. ఇందులో భక్తుల కథలు వారి ప్రవృత్తిని తెలిపే కథలున్నాయి.
ఒక కథలో మహర్షి మేధా సురథ మహారాజుతో పరమేశ్వరి మహిమలను యిలా తెలి పాడు.
శ్లో|| తాము పైహి మహారాజు- శరణం పరమేశ్వరీం
ఆరాధితా సైవనౄణం- భోగస్వర్గాప వర్గదా|| అంటూ
”రాజా! మీరు ఆ పరమేశ్వరిని శరణు వేడండి. నిష్ఠతో ఆరాధిస్తే ఆమెయే మానవులకు స్వర్గమును- భోగములను ప్రసాదిస్తుంది. ఐశ్వర్య కాముడగు సురథ మహారాజు భగవతిని ఆరాధించి, అఖండ సామ్రాజ్యాన్ని పొందాడు.
అలాగే ఇంకో కథలో విరక్తుడైన ‘సమాధి’యను వైశ్యుడు, దుర్ల భమగు జ్ఞానం ద్వారా మోక్షం పొందాడు. ఈ గ్రంథం ఆశీర్వాద రూపమైనదీ, మంత్రమయమైనది. ఎందరో ఆర్తులు- జిజ్ఞాసువు లు- అర్థార్థులు- కోర్కెలు తీర్చుకొన్నారు. ఈ గ్రంథమును నిత్య పారాయణం చేసి ముఖ్యంగా శరన్నవరాత్రులశా దేవి జగన్మాతగా దుర్గను భక్తిశ్రద్ధలతో స్మరించాలి.
దుర్గాద్వాత్రింశన్నామమాలలో దుర్గావైభమున్నది.
శ్లో|| దుర్గా దుర్గార్తి శమనీ- దుర్గా పద్విన్నివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గసాధనీ- దుర్గనాశినీ!! అని మంత్రము.
ఈమె ఆర్తరక్షకి, పాపాలను దూరం చేస్తుంది. కష్టాలను నివారి స్తుంది. తనను ఆరాధించే వారిని ఉద్ధరిస్తుంది. అజ్ఞానమును పార ద్రోలుతుంది. జ్ఞాన బిక్షను ప్రసాదిస్తుంది. రాక్షస లోకానికి దావాన లం వంటిది. దుర్గ ఆత్మస్వరూపిణి. ధ్యానం చేస్తే మదిలో నిల్చి ప్రకాశించే మాత. భక్తుల విశ్వాసానికి ప్రతీక. నమ్మిన వారి ని కంటికి రెప్పలా కాచే దుర్గ. శరన్నవరాత్రులలో దుర్గ- లక్ష్మి- సరస్వతుల ఆరాధనలో దుర్గా దేవికే ప్రథమ స్థానం. దుర్గాదేవి చండీరూపంలో శుంభ-నిశుంభులను రక్కసులను సంహరించిన వీరమాత. ధీరో దాత్త. మహిషుని మట్టుబెట్టిన మహనీయ దేవతారూపిణి జగన్మాత దుర్గాదేవియే. ఈ విషయాలు మార్కండేయ పురాణంలో వున్నాయి.
శ్లో|| మహిషాసుర నిర్ణాశి- భక్తానాం సుఖదే నమ:
రూపందేహి- జయందేహి- యశోదేహి ద్విషోజహి||
మతంగ మహర్షిచే పూజింపబడిన దేవి, సత్యానంద స్వరూ పిణి. భవానీ భవ మోచని. సర్వశత్రు వినాశిని. భూతార్తిహారిణి. అచింత్య రూప చరిత. సర్వసౌభాగ్యదాయిని. అమ్మలగనయమ్మ.
శ్రీమహాకాళి- మహాలక్ష్మి- మహాసరస్వతి- బాలాత్రిపురసుంద రి- లలితాత్రిపురసుందరి- రాజరాజేశ్వరి- చిచ్ఛక్తి రూపమైన కుండ లినీ మహాశక్తియే శ్రీ కనక దుర్గాదేవి. భవానీ నామధారిణి.
”అరుణాకరుణా తరంగి తాక్షీం- ధృతపా శాంకుశ పుష్పబాణచాపాం
అణిమాదిభిరావృతాం మయూఖై: అహమిత్యేవ విభావయే భవానీం!!”
దుర్గాదేవి సింహవాహిని. నానాలంకార భూషిణి. చతుర్భుజా లతో విరాజిల్లుతున్నది. నాగ యజ్ఞోపవీత దుర్గ. రక్తవస్త్రాలంకృత. మేను బాలార్క సదృ శం. వరదాయిని- ముని గణములకు నిరంత రం రక్షణగా వుండే దేవి దుర్గ. ఇచ్ఛాశక్తి- జ్ఞానశక్తి- క్రియాశక్తిలతో విలసిల్లే మహాదేవి.
శ్రీమన్నారాయణుడు నారదునికి దుర్గా దేవి కవచమును ఉపదేశించాడు. ఈ కవచ పారాయణం వలన సర్వత్ర విజయం లభి స్తుంది. దుర్గాసురుడనే రాక్షసుడుని వధించిం ది. నవరాత్రులలో దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మనసు నిర్మల మౌతుంది. అనంత రూపిణి. దేవీ స్వరూపాన్ని, మహిమలను వేదా లు ప్రస్తుతించాయి. ఆ రూపం దుష్ట సంహారానికే. ఆమెది ముల్లోకా లనూ మోహింపజేసే సౌందర్యం. అందుకే ఆ తల్లిని జగన్మోహిని. దేశంలోని 51 శక్తి పీఠాలలో దుర్గాదేవి పూజలు అందుకుంటోంది. కనకదుర్గాదేవి అను గ్రహం ప్రతి ఒక్కరికీ కలగాలనే ఆ దేవి ఆరాధన లో పునీతులు కావాలనీ ఆకాంక్షిద్దాం.
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి
తన్నో దుర్గో ప్రచోదయాత్
ఇది దుర్గా గాయత్రీ మంత్రం. వేద మంత్రాలలో ఈ మంత్రం ప్రశస్తమైనది. విశిష్టమైనది.
– పివి సీతారామ మూర్తి
9490386015