Saturday, November 23, 2024

చిన్న బిడ్డకు సాయి రక్ష

యోగులు, అవతార పురుషులు ఒక్కో సారి త మ లీలా విలాసంలో భాగంగా వివిధ రూపాలలో కనిపిస్తుం టారు. సాయిబాబా కూడా అలా వివిధ రూపాలలో కనిపించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అందరిలాగే సాయిబాబా కూడా బాల్యావస్థ అంటే ఇష్టపడేవారు. ఒకసారి హరిసీతారాం దీక్షిత్‌తో ‘ఇప్పుడు వెళ్లిపోయి ఎనిమిదేళ్ల బాలునిగా మరల వస్తాను” అని అన్నారు. శ్రీకృష్ణుడు దేవకీ మాత వద్ద ప్రకటన మయినప్పుడు ఆయనకు ఎనిమిదేళ్లు అని పురాణాలలో వర్ణన ఉన్నది. సాయిబాబా బాలకృష్ణుడే. అప్పుడప్పుడే పారాడటం నేర్చుకుంటున్న శివుడు కూడా ఆయనే. అలాగ ఒక తెలుగు భక్తునికి దర్శనం ఇచ్చారు కూడా. ఆ అదృష్టవంతుడు విజయవాడకు చెందిన నందిపాటి జగన్నాయకులు. ఆయన వ్యాపార పర్యటనలకై బొంబాయి వెళ్లి వస్తుండేవారు. ఆ సమయంలో ఆయనకు ఒక వృద్ధుడు కనబడి షిర్డీ గ్రామంలో ఒక అవాలియా గలరని, ఆయనను దర్శించమని చెప్పారు. జగన్నాయకులు షిరిడీ వెళ్లారు. తనను షిర్డీ వెళ్లమని చెప్పిన వృద్ధుడు అక్కడి సాయి ఒకేలా కనిపించారు. కొంచెం సేపైన తర్వాత జగన్నాయకునికి ఇష్టమైన బాలకృష్ణునిగా పారాడే బిడ్డగా సాయి దర్శనం యిచ్చారు. ఆయన పాదాలకు జగన్నాయకులు మొక్కారు. సాయిబాబా ఎనిమిదేళ్ల బాలుడే కాదు. పారాడే చిన్ని కృష్ణుడే కాదు. అప్పుడేజన్మించిన దత్త్తాత్రేయుడు కూడా! 1911లో దత్త జయంతి నాటి సాయంత్రం ఐదు గంటలకు సాయి ”ప్రసవ వేదనను భరించలేకున్నాను” అంటూ కేకలు వేస్తూ భక్తులను తరిమివేశారు. కాసేపటికి అందరినీ లోనికి పిలిచారు. అప్పుడు ముందుగా లోనికి ప్రవేశించిన బల్వంత్‌ ఖోజోకర్‌కు సాయిబాబా కనిపించలేదు. ఆయన ఆసనంపై ముుద్దులొలికే పాపగా దత్తాత్రేయుడు కనిపించాడు. బాల దత్తునికి నమస్కారం చేసి లేచి చూసే సరికి సాయిబాబా చిరునవ్వుతో కనిపించారు.
శైశవమన్నా, బాల్యమన్నా అంత ప్రీతి సాయికి. అందుకనే వైశవ బాల్యదశలలో బిడ్డ్డలను కంటికి రెప్పలాగా చూసుకునే తల్లి, తండ్రి సాయిబాబా. సాయిబాబా ఒక తల్లి, ఒక తండ్రి మాత్రమే కాదు ‘ శతమా తాపి తృసమానాయ సాయినాధా య అని బషీర్‌బాబా కీర్తించారు. బోధనా పద్ధతి లో సాయిబాబాకు ప్రత్యేకతలున్నట్టే తన బిడ్డ్డల సంరక్షణలో సైతం ప్రత్యేకత వైవిధ్యం కనిపిస్తాయి.


ముళ్లపూడి పాండురంగ సాయినాథ్‌
మున్నలూరి బోస్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement