తిరుమల, ప్రభన్యూస్ : శ్రీవారి వార్షిక బ్ర హ్మోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో మలయప్పస్వామివారు ఐదు తలల శేషు వాహనంపై గీతాకృష్ణుని అలంకారంలో దర్శనమిచ్చారు. చిన్న శేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలినియోగం సిద్దిఫలం లభిస్తుందని ప్రశ స్థి. శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నమూనా బ్రహ్మరథం, వృషభ, అశ్వ, ఏనుగులదే అగ్రస్టానం. శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో నమూనా బ్ర హ్మరథం, వృషభాలు, అశ్వాలు, ఏనుగుల సెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలి చాయి. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ , చిన్నజీయర్ స్వాములు, టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో జవహర్ రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు ప్ర శాంతిరెడ్డి, సనత్‌కుమార్, అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి దంపతులు, సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి దంపతులు, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, వీజీవో బాలిరెడ్డి, ఆలయ డిప్యూటి ఈవో రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
హంస వాహనంపై పరమహంసుడు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన శుక్రవారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో మలయప్ప స్వామి వారు హంస వాహనంపై వీణ ధరించి, సరస్వతీదేవి అలంకారంలో దర్శన మిచ్చారు. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి. బహ్మోత్సవాలలో మూడవ రోజైన శనివారం ఉదయం 9 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
చిన్నశేష వాహనంపై గీతాకృష్ణుడు
Advertisement
తాజా వార్తలు
Advertisement