తిరుమల : గదులు పొందే యాత్రికుల సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు/సూచనలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికేషన్ రూపొందించాలని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఐటి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వేలాది గదులు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో గదులు పొందిన యాత్రికులు ఫర్నీచర్, పరుపులు, కొళాయిలు, పరిశుభ్రత, లైట్లు తదితర సమస్యలను తెలిపేందుకు వీలుగా ప్రత్యేకంగా సెల్ నంబరు ఏర్పాటు చేయాలని రిసెప్షన్ అధికారులను ఆదేశించారు. ఈ నంబరుతో పాటు అవసరమైన ఇతర సమాచారాన్ని అన్ని గదుల్లో స్టిక్కర్ల ద్వారా యాత్రికులకు తెలియజేయాలన్నారు. గదులు పొందిన యాత్రికులకు పంపే ఎస్ఎంఎస్‌లో కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ సమాచారం ఉంచాలన్నారు. యాత్రికుల ఫిర్యాదులు/సూచనలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా రిసెప్షన్ విభాగం తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గదుల్లో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement