Friday, November 22, 2024

గురు విశ్వస్ఫూర్తి ప్రస్థాన సాధన

ఆధ్యాత్మిక విశ్వ గురువులు, సైంటిఫిక్‌ సెయింట్‌, పూర్ణ గురువులు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో చైతన్య స్ఫూర్తి అకాడమీ, మణికొండలో ఆగష్టు 28 నుండి 30 వరకు మూడు రోజులపాటు ‘స్ఫూర్తి సాధనా శిబిరం’ నిర్వహించారు.
మంచీ- చెడూ రెండూ మనసులోనే ద్వంద్వంగా ఉంటాయి. యుగాలుగా, తరాలుగా మనిషిలోని చెడు నూ, దుష్టత్వాన్నీ పోగొట్టాలని ప్రయత్నిస్తున్నా, అవి నానాటికీ పెరుగుతూ ఎంత దుర్మార్గంగా, దుర్భరంగా చేస్తున్నాయో చూస్తున్నాం. నక్షత్ర మండలాలకు వెళ్ల గలిగే టెక్నాలజీని కనిపెట్టిన మనిషి మరొక ప్రక్క విపరీత ధోర ణులతో, అశాంతితో, తానెవరో, తన జీవిత ప్రాధాన్యత ఏమి టో, తన సమస్యలకు పరిష్కారాలు ఏమిటో, ఎన్నో ప్రశ్నలకు జవాబు తెలియని స్థితిలో వున్నాడు.
వీటన్నికి జవాబుగా ‘ప్రస్థాన సాధన’ ఒక రక్షక కవచం వంటిదనీ, దీని ద్వారా మాత్రమే రాబోయే విపత్కర పరిస్థితు లలో మందులకు సైతం లొంగని వైరస్‌లను. ఎదుర్కొనగల రని, నిర్వాహకులు తెలిపారు. ఈ సాధనా విధానం ద్వారా మనసుకు ఒత్తిడి తగ్గి, ప్రశాంతత కలుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. క్రమశిక్షణ, మానసిక నియంత్రణ అలవాటు అవు తుంది. దృఢమైన శరీరంలో శక్తివంతమైన మనసుంటుంది. ప్రస్తుత సమాజంలో సాధనా శిబిరాల ఆవశ్యకత ఎంతో ఉం దని నిర్వా#హకులు పేర్కొన్నారు.
బ్రెయిన్‌లో ఉన్న న్యూరాన్ల క్వాలిటీ పెంచి తద్వారా తయారయ్యే మనసు క్వాలిటీ పెంచి తద్వారా మనిషిలో మం చిని మానవత్వాన్ని పెంచడం సాధ్యమౌతుంది. అందుకు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు అనుగ్ర#హంచిన ‘ప్రస్థాన సాధన’ సాధనంగా ఉపయోగపడుతుంది. యోగా శిక్షణలో నిష్ణాతులు డా|| ప్రతాప్‌గారి నేతృత్వం లో అన్ని వయసులవారిని, శారీరక రుగ్మతలున్న వారిని దృష్టిలోవుంచుకొని ఆసన ప్రాణాయా మాలలో శిక్షణ ఇచ్చారు. మధ్య సమయంలో గురుదేవులు రచించిన గ్రంథములపై విశ్లే షణాత్మక ప్రసంగాలు, అవగా#హనా కార్యక్రమాలు, గురుదేవు ల దివ్య ఆశీస్సులతో తాము పొందిన అనుభవాలను భక్తులు పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement