అధ్యాయం 16, శ్లోకం 7
7.
ప్రవృత్తిం చ నివృత్తిం చ
జనా న విదురాసురా: |
న శౌచం నాపి చాచారో
న సత్యం తేషు విద్యతే ||
తాత్పర్యము : ఆసురీగుణములు గలవారు చేయవలసినదేదియో, చేయరానిదేదియో ఎరుగకుందురు. శుచిత్వముగాని, సదాచారాముగాని, సత్యము గాని వారి యందు గోచరించదు.
భాష్యము : మానవ సమాజ క్షేమము కొరకు శాస్త్రముల ద్వారా, గొప్ప ఋషుల ద్వారా మంచి నియమ నిబంధనలు ఇవ్వబడినవి. ఉదాహరణకు మనుసంహిత అటువంటి గ్రంథము. అందు స్త్రీలను బాల్యములో తండ్రి, యవ్వనములో భర్త, ముసలితనములో కొడుకు సంరక్షణలో ఉండవలెనని సూచించబడినది. ఇటువంటి విలువైన సూచనలను నిర్లక్ష్యము చేసినా, ఉల్లఘించినా, విశ్వాసము పెట్టకపోయినా అసుర లక్షణములు పెంపొందించుకునే అవకాశము ఉన్నది. నేడు స్త్రీకి పురుషునితో సమానమైన స్వేచ్ఛను ఇవ్వమని కోరుచున్నారు. దీని వలన వారు సంరక్షణను కోల్పోయి, వివాహ వ్యవస్థ కూలిపోవుచున్నది. అసుర లక్షణములు ఉన్నవారు వారికి మంచి ఏదో గమనించక కష్టాలను కోరి తెచ్చుకుందురు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..