Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 5
5.
దైవీ సంపదమాసురీమ్‌
నిబంధాయాసురీ మతా |
మా శుచ: సంపదం దైవీమ్‌
అభిజాతోసి పాండవ ||

తాత్పర్యము : దైవీగుణములు మోక్షమునకు అనుకూలములై యుండగా అసురగుణములు బంధకారకములగుచున్నవి. ఓ పాండుపుత్రా! నీవు దైవీ గుణములతో జన్మించి యున్నందున శోకింపకుము.

భాష్యము : ఈ శ్లోకము నందు శ్రీకృష్ణుడు అర్జునున్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. తాను చేయబోవు యుద్ధము వలన అసుర లక్షణములు పెంపొందవని సూచించుచున్నాడు. తాను ఏది మంచో, ఏది చెడో పరిశీలించినాడు. గౌరవనీయులైన భీష్మ ద్రోణులతో యుద్ధము చేయవచ్చునా లేదా అని విచారించినాడు. అతడు కోపమును, గర్వమును, దురుసుతనమును ప్రదర్శించుటలేదు. కాబట్టి అసుర లక్షణములు లేవు. పైగా క్షత్రియునిగా కృష్ణుని ప్రసన్నార్థము చేయు యుద్ధము దివ్యమైనది కాబట్టి అర్జునుడు చింతించనవసరము లేదు. ఎవరైనా తమ ధర్మాలను భగవంతుని ప్రసన్నార్థము చేసినట్లయితే దివ్యస్థితిలో నిలుచుదురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement