Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 2
2.
అహింసా సత్యమక్రోధ:
త్యాగ: శాంతిరపైశునమ్‌ |
దయా భూతేష్వలోలుప్త్వం
మార్దవం హ్రీరచాపలమ్‌ ||

తాత్పర్యము : అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషముల నెన్నకుండుట, జీవులందరి యెడ దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, ధృఢనిశ్చయము అనునవి దివ్య లక్షణములు.

భాష్యము : ఈ శ్లోకములో బ్రాహ్మణుని లక్షణాలు వివరించబడినవి.

అహింస :- ఏ జీవరాశి ఎదుగుదలను నిరోధించరాదు. ప్రత్యేకించి జంతు వధ చేయరాదు.
సత్యము : స్వార్థము కోసము నిజాన్ని కప్పి పుచ్చరాదు. సత్యాన్ని గురువుని ఆశ్రయించి శాస్త్రముల ద్వారా తెలుసుకొనవలెను.
అక్రోధ: :- క్రోధమును నిరోధించుట. ఇది రజో గుణ లక్షణము కనుక దీనిని నియంత్రించవలెను.
అపెశునము :- వేరే వారిలో అనవసరముగా తప్పు చూడరాదు లేదా వారిని నిర్దేశించరాదు.
హ్రీ: :- సత్‌ ప్రవర్తన కలిగి నీఛమైన కార్యములు చేయకుండుట
అచాపలం :- ఎన్నోసార్లు విఫలమైనా నిరుత్సాహపడక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించుట.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement