అధ్యాయం 15, శ్లోకం 20
20.
ఇతి ఉహ్యతమం శాస్త్రమ్
ఇదముక్తం మయానఘ |
ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్
కృతకృత్యశ్చ భారత ||
తాత్పర్యము : ఓ పాపరహితుడా! వేదములందలి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడించితిని. దీనిని అవగాహన చేసికొనినవాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పూర్ణవిజయమును పొందగలవు.
భాష్యము : వేదాల సారాన్ని భగవంతుడు స్పష్టముగా వివరించుచున్నాడు. దీనిని అర్ధము చేసుకున్న వ్యక్తి త్రిగుణముల కలుషితము నుండి ముక్తుడు కాగలుగుతాడు. భగవంతుడు సూర్యుని వంటి వాడు. అజ్ఞానము అంధకారము వంటిది4. ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారము నిలువలేదు. కాబట్టి తెలివిగల వారు గురువు మార్గదర్శకత్వములో భగవద్భక్తిని స్వీకరిస్తారు.
ఇక్కడ అర్జునున్ని ‘అనఘ’ అను పదముత సంబోధించుట ముఖ్యమైనది. పాపములేని వాడు అని అర్ధము. పాపముల నుండి ముక్తి పొందకుండా కృష్ణున్ని సంపూర్ణముగా అర్థము చేసుకొనుట సాధ్యము కాదు. భగవద్భక్తి ఎంత పరిశుద్ధమైనది, శక్తివంతమైనదంటే , దానిలో నిమగ్నుడైన భక్తుడ్ని పాపరహితుణ్ని చేస్తుంది. దీనికి రెండు రకాల బలహీనతలను విడనాడవలసి ఉంటుంది. మొదటిది – ఈ భౌతిక ప్రకృతిని అనుభవించాలనే కోరిక, ఇక రెండవది – ఆ కోరిక వలన కలుగు భౌతిక అనుబంధము.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
పురుషోత్తమయోగోనామ పంచదశోధ్యాయ: ||
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..