Wednesday, November 27, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 18
18.
యస్మాత్‌ క్షరమతీతో హమ్‌
అక్షరాదపి చోత్తమ: |
అతోస్మి లోకే వేదే చ
ప్రథిత: పురుషోత్తమ: ||

తాత్పర్యము : క్షర, అక్షర పురుషులకు అతీతుడును, ఉత్తమమోత్తముడను అగుటచే నేను ఈ జగమునందును మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధినొందితిని.

భాష్యము : పైన పేర్కొన్న రెండు రకాల జీవరాశులైన బద్ధ జీవులు, ముక్తుల జీవుల కంటే భగవంతుడు ఎంతో ఉన్నతుడై పరిమాణ రిత్యా అద్వితీయమైన శక్తులను కలిగి ఉన్నవాడు. కాబట్టి అటువంటి భగవంతుడు, జీవునితో సరిసమానుడని భావించుట సరి కాదు. ఇక్కడ ఆ తేడాను ‘ఉత్తమ’ అను పద ప్రయోగము తేట తెల్లము తెల్లము చేయుచున్నది. కాబట్టి ఎవ్వరూ దేవాది దేవుణ్ని అధిగమించలేరు. ఈ విషయము వేదాలలో ప్రత్యేకించి వేదాల ఉద్ధేశ్యాన్ని వివరించే స్మృతి శాస్త్రాలలో నొక్కి వక్కాణించడమైనది. భగవంతుడు బ్రహ్మజ్యోతికి కూడా మూలమని, అతడే పరమాత్మ రూపములో విస్తరించి ఉన్నాడని అంతే కాక వ్యాసదేవునిగా అవతరించి వేద జ్ఞానమును వివరించి ఉన్నాడని అర్థము చేసుకొనవలెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement