Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 6
6.
న తద్భాసయతే సూర్యో
న శశాంకో న పావక: |
యద్గత్వా న నివర్తంతే
తద్ధామ పరమం మమ ||

తాత్పర్యము : అట్టి నా దివ్యధామము సూర్యునిచేగాని, చంద్రునిచే గాని లేదా అగ్నివిద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరినవారు తిరిగి ఈ భౌతిక జగమునకు తిరిగిరారు.

భాష్యము : ఈ శ్లోకము ఆధ్యాత్మిక లోకమైన శ్రీకృష్ణుని లోకమును వివరించుచున్నది. ఆధ్యాత్మిక లోకములైన వైకుంఠలోకములు స్వయం ప్రకాశకములు. వీటి కాంతి పుంజములనే బ్రహ్మజ్యోతి అందురు. అక్కడ జీవుడు శాశ్వత జీవితాన్ని, శాశ ్వత ఆనందాన్ని పొందుచూ, సంపూర్ణ జ్ఞానమును పొంది ఉంటాడు. ప్రతి జీవునికి అటువంటి స్థితిని పొందే అవకాశము ఉన్నది. అయితే దానికి ఈ భౌతిక బంధనాల నుండి విముక్తిని పొందవలసి ఉన్నది. భక్తుల సాంగత్యములో భగవంతుని గురించి శ్రవణ కీర్తనలు చేయుట ద్వారా క్రమేణ ఈ బంధనము బలహీనపడుతుంది. కాబట్టి భగవత్సేవ పట్ల ఆకర్షితులైన వారే ఈ భౌతిక బంధనాల నుండి విముక్తులు కాగలరు గాని కేవలము కాషాయపు ధరించినంత మాత్రాన ఇది సాధ్యపడదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….

Advertisement

తాజా వార్తలు

Advertisement