Monday, November 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 13
13.
అప్రకాశో ప్రవృత్తిశ్చ
ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయంతే
వివృద్ధే కురునందన ||

తాత్పర్యము : ఓ కురునందనా! తమోగుణము వృద్ధినొందినప్పుడు అంధకారము, సోమరితనము, బుద్ధిహీనత, భ్రాంతి యనునవి వ్యక్తములగును.

భాష్యము : ఇక తమో గుణముల నున్న వ్యక్తిలో జ్ఞానము లోపిస్తుంది. ఒక నీతి నియమము లేకుండా ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. అతని జీవితమునకు ఒక ల క్ష్యము ఉండదు. పనిచేసే సామర్థ్యము ఉన్నా సోమరివలే ప్రయత్నమే చేయడు. దీని నే మోహము అందురు. మరొక విధముగా చెప్పవలెనన్న జీవచ్చవము వలే జీవించును. ఇవి తమోగుణ స్వభావుల లక్షణములు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement