Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 9
9.
సత్త్వం సుఖే సంజయతి
రజ: కర్మణి భారత |
జ్ఞానమావృత్య తు తమ:
ప్రమాదే సంజయత్యుత ||

తాత్పర్యము : ఓ భరతవంశస్థుడా! సత్త్వ గుణము మనుజుని సౌఖ్యమునందు బంధించును, రజోగుణము అతనిని కామ్యకర్మమునందు బంధించును, తమో గుణము జ్ఞానమును కప్పివేయుట ద్వారా బుద్ధి హీనత యందు అతని ని బంధించును.

భాష్యము : సత్త్వ గుణములో ఉన్న వ్యక్తి తను చేసే పనిచేత సంతృప్తి చెంది ఉండును. శాస్త్రజ్ఞులు, తత్త్వ వాదులు, బోధకులు తాము చేసే పని ద్వారా జ్ఞానమును సంపాదిసత్‌ఊ కొంత సంతృప్తిని పొందుచూ ఉందురు. రజోగుణములో నున్న వ్యక్తి సంపాదనలో నిమగ్నుడై, వీలైనంత సంపాదించి మంచి కార్యములకు దాన ధర్మములు చేయును. ఇక తమో గుణములో నున్న వ్యక్తి అజ్ఞానము కారణమున తనకు గాని మిగిలిన వారికి గాని మేలు చేయలేడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement