అధ్యాయం 13, శ్లోకం 35
35
క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవమ్
అంతరం జ్ఞానచక్షుషా |
భూతప్రకృతిమోక్షం చ
యే విదుర్యాంతి తే పరమ్ ||
తాత్పర్యము : దేహము మరియు దేహమును ఎరిగిన క్షేత్రజ్ఞునకు నడుమ గల భేధమును జ్ఞానదృష్టితో దర్శించి, ప్రకృతి బంధము నుండి మోక్షమును పొందు విధానము ఎరుగగలిగినవారు పరమగతిని పొందగలరు.
భాష్యము : ఈ అధ్యాయము నందు శరీరము, దాని యజ మాని ఆత్మ మరియు పరమాత్మల గురించిన జ్ఞానము ఇవ్వబడినది. ఎవరైతే ఆత్మ, 24 మూలకాలతో సంపర్కము లోనికి వచ్చుట వలన ఈ ప్రపంచము కొనసాగుచున్నది, అంతేకాక భగవంతుని యదార్థ స్థితిని కూడా అర్థము చేసుకొన్నట్లయితే వారు ఆధ్యాత్మిక ప్రపంచమును చేరుకొనుటకు అర్హులు అవుతారు. ఒక ఆధ్యాత్మిక గురువు నుండి విని, ఆయన సూచనలను పాటించినట్లయితే ఈ జ్ఞానమును సంపూర్ణముగా అర్థము చేసుకొనగలుగుతారు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగో నామ త్రయోదశోధ్యాయ: ||