అధ్యాయం 13, శ్లోకం 29
29
సమం పశ్యన్ హి సర్వత్రసమవస్థితమీశ్‌వరమ్ |
న హినస్త్యాత్మనాత్మానం
తతో యాతి పరాం గతిమ్ ||
తాత్పర్యము : సర్వత్ర ప్రతిజీవి యందును సమముగా నిలిచియుండు పరమాత్మను దర్శించువాడు తన మనస్సుచే తనను తాను హీనపరచుకొనడు. ఆ విధముగా అతడు పరమగతిని పొందగలడు.
భాష్యము : జీవుడు ఆధ్యాత్మిక ప్రవృత్తి నుండి భౌతిక ప్రకృతికి పతనమైనపుడు వేరుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అతడు ప్రతిజీవిరాశి యందు భగవంతుని పరమాత్మ రూపాన్ని గుర్తిస్తాడో మరింత పతనము కాకుండా తిరిగి ఆధ్యాత్మిక ప్రపంచము వైపునకు పురోగమిస్తాడు. మనస్సు ఎప్పుడూ ఇంద్రి య భోగాలను అనుభవించటానికి ప్ర ణాళికలను వేస్తూ ఉంటుంది. కాని అటువంటి మనస్సు పరమాత్మను గుర్తించగలిగినట్లయితే క్రమేణ ఆధ్యాత్మిక అవగాహన బ లపడుతుంది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….