Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 25
25
ధ్యానేనాత్మని పశ్యంతి
కేచిదాత్మానమాత్మనా |
అన్యే సాంఖ్యేన యోగేన
కర్మయోగేన చాపరే ||

తాత్పర్యము : పరమాత్ముని కొందరు ధ్యానము చేతను, మరికొందరు జ్ఞానాభ్యాసము చేతను, ఇంకను కొందరు నిష్కామ కర్మ చేతను తన యందే దర్శింతురు.

భాష్యము : రెండు రకాల బద్ధ జీవులు ఉందురు. ఒకరు నాస్తికులు, వితండ వాదులు ఇక రెండవ వారు అంతర్ముఖులైన భక్తులు, సాంఖ్యాత త్త్వ వాదులు మరియు కర్మ నొనరించువారు. ఆత్మ పరమాత్మ ఒకరే నని వాదించువారు కూడా మొదటి తరగతికే చెందుదురు. సాంఖ్యాతత్త్వ వాదులు, ఆత్మ, భౌతిక మూలకాల కంటే భిన్నమని తెలుసుకున్నప్పుడు దానిని 25వ అంశముగా ఇక భగవంతుణ్ని 26వ అంశముగా అర్థము చేసుకుని భక్తులగుదురు. అలాగే భగవంతుని కోసం కర్మ నొనరించువారు, భగవంతుని పట్ల క్రమేణ ఆకర్షణ పెంపొందించుకుని భక్తులగుదురు. అంతేకాక పవిత్ర ఆత్మలు పరమాత్మను అన్వేషించి తమ హృదయమున ఉన్న పరమాత్మను గుర్తించగలిగి దివ్యానందమును పొందుదురు. వీటన్నింటిని బట్టి భక్తులు ఆత్మాన్వేషణలో సరైన స్థితిలో ఉన్నారని భగవంతుడు, భౌతిక సంసారానికి అతీతముగా ఉండి పరమాత్మగా ప్రతి హృదయములో నిలిచి ఉన్నాడనే సరైన జ్ఞానమే దీనికి కారణమని అర్థము చేసుకొనవచ్చు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement