Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 20
20
ప్రకృతిం పురుషం చైవ
విద్ధ్యనాదీ ఉభావపి |
వికారాంశ్చ గుణాంశ్చైవ
విద్ధి ప్రకృతిసంభవాన్‌ ||

తాత్పర్యము : జీవులు మరియు భౌతిక ప్రకృతి రెండును అనాది యని తెలిసికొనవలెను. వాని యందలి పరివర్తనములు మరియు భౌతిక గుణములనునవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి.

భాష్యము : జీవుడు మరియు పరమాత్మ ఇరువురూ భగవంతుని విభిన్న వ్యక్త రూపములేనని అర్ధము చేసుకొనవలెను. అయితే జీవుడు శక్తిలో భాగమయితే పరమాత్మ భగవంతుని విస్తార అవతారము. వారిరువురూ శాశ్వతమైన వారే. అనగా వారు సృష్టికి పూర్వము నుండే ఉండి, అవసరమైనపుడు వ్యక్తమవుతారు. నిజానికి జీవుడు స్వతహాగా భగవంతునిలో విభిన్న అంశ. అయితే విధేయతను కోల్పోయినపుడు ఈ భౌతిక ప్రకృతిలో బంధింపబడతాడు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో అర్ధము చేసుకోవటము అంత ముఖ్యము కాదు. అది భగవంతునికే తెలుసు. భౌతిక ప్రకృతిని అనుభవించాలనే కోరికే, జీవి ఈ ప్రపంచమున ఇన్ని ఇబ్బందులు పడటానికి కారణమవుతుందని చెప్పబడినది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement