Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 17
17.
యస్య నాహంకృతో భావో
బుద్ధిర్యస్య న లిప్యతే
హత్వాపి న ఇమాన్‌ లోకాన్‌
న హంతి న నిబధ్యతే ||

17. తాత్పర్యము : మిథ్యాహంకారముచే ప్రభావితుడు కానివాడును, సంగత్వరహిత బుద్ధిని కలిగిన వాడును అగు మనుజుడు జనులను సంహరిం చినను సంహారమొనర్చన ట్లే యగును. అతడెన్నడును తన కర్మలచే బద్ధుడు కాడు.

భాష్యము : ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణుడు ”యుద్ధము చేయరాదు” అను నిర్ణయము కేవలము అహంకారము వలనే వచ్చునని అర్జునునికి తెలియజేయుచున్నాడు. ఎవరైతే తాను కర్తనని, ఇంద్రియములు కార్యము చేయుటకు పరికరములని, చివరకు భగవంతుడే అనుమతించే వ్యక్తి అని తెలుసుకుంటాడో అతడు మోహము చెందక పోవుటే కాక తన కార్యముల ఫలితములకు బాధ్యత వహించవలసిన అవసరము ఉండదు. అటువంటి కార్యము వేరే వారిని సంహరించుట అయినా సరే అతడు బాధ్యత వహించవలసిన అవసరము లేదు. అయితే అహంకారముతో, స్వంతముగా చేయు కార్యములకు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎలా అంటే సైనిక అధికారి ఆజ్ఞ వలన సిపాయి ఎవరినైనా సంహరించినట్లయితే అతడిని కోర్టు శిక్షించదు. కాని అటువంటి ఆజ్ఞ లేకుండా ఎవరినైనా సంహరిస్తే అతడు శిక్షింపబడతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement