Sunday, November 24, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 14
14
సర్వత: పాణిపాదం తత్‌
సర్వతోక్షిశిరోముఖమ్‌ |
సర్వత: శ్రతిమల్లోకే
సర్వమావృత్య తిష్ఠతి ||

తాత్పర్యము : సర్వత్ర అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించియున్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించి నిలిచియుండును.

భాష్యము : సూర్యుడు తన కిరణాల ద్వారా అంతటా వ్యాపించి ఉన్నట్లు, భగవంతుడు లేదా పరమాత్మ కూడా అంతటా వ్యాపించి ఉండును. సర్వాంతర్యామిగా అంతటా వ్యాపించి ఉన్నా బ్రహ్మకు మొదలు చిన్న చీమ వరకూ అతనిలోనే భాగమై ఉందురు. అందువల లెక్కలేనన్ని తలలు, కాళ్ళు మరియు కళ్ళు ఉన్నాయి. అంతేకాక లెక్కలేనన్ని జీవులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పరమాత్మ లోపల ఇమిడి యుండుటే కాక పరమాత్మపై ఆధారపడియూ ఉన్నవి. కాబట్టి పరమాత్మ సర్వవ్యాపి. కానీ జీవుడు ఆ విధముగా నా కాళ్ళూ, చేతులు, కళ్ళూ సర్వత్రా ఉన్నాయని చెప్పలేడు. సర్వవ్యాపి అయిన భగవంతుడు తన ధామము నుండి ఈ లోకములో భక్తుడు అర్పించే నైవేద్యాన్ని స్వీకరించగలుగుతాడు. అదే ఆయన యొక్క అమోఘ శక్తి. కాని జీవుడు ఆ విధముగా చేయలేడు కాబట్టి ఈ శ్లోకము పరమాత్మను వివరస్తున్నదే కాని ఆత్మను కాదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement