Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 10
10.
తేషాం సతతయుక్తానాం
భజతాం ప్రీతిపూర్వకమ్‌ |
దదామి బుద్ధియోగం తం
యేన మాముపయాంతి తే ||

తాత్పర్యము : ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను ప్రసాదించుదును.

భాష్యము : బుద్ధి యోగమనగా భగవద్భక్తి ద్వారా శ్రీకృషణుని చేరుటయే లక్ష్యముగా పెట్టుకొని, ప్రేమతో ఆయనను సేవించుట అయితే దీనిని పాటించుటకు శుద్ధ భక్తుడైన గురువు యొక్క మార్గదర్శకత్వము తప్పనిసరి. అయితే ఇవన్నీ ఉన్నా భక్తునిలో తెలివితేటలు లోపిస్తే, హృదయములో పరమాత్మగా ఉన్న శ్రీకృష్ణుడు సరైన తెలివితేటలను ఇచ్చి గమ్యానికి చేరుస్తాడు. కాబట్టి భక్తుడు చేయవలసినదల్లా చిత్తశుద్ధితో, ప్రేమతో భక్తి కార్యక్రమములను కొనసాగించుటయే.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో

Advertisement

తాజా వార్తలు

Advertisement