Friday, October 18, 2024

గీతాసారం (ఆడియోతో…)


అధ్యాయం 9, శ్లోకం 9

9.
న చ మాం తాని కర్మాణి
నిబధ్నంతి ధనంజయ |
ఉదాసీనవదాసీనమ్‌
అసక్తం తేషు కర్మసు ||

తాత్పర్యము : ఓ ధనుంజ యా! ఈ కర్మ యంతయు నన్ను బంధింపదు. నేను తటస్థునివలె ఉండి ఈ భౌతిక కర్మలన్నింటి యెడ సదా ఆసక్తిలేని వాడనై ఉందును.

భాష్యము : ఇక్కడ భగవంతుడు తన ప్రమేయమును స్పష్ట పరుచుచూ ఉన్నాడు. తాను భౌతిక కార్యములలో పాలు పం చుకొనడు. జీవుడు సృష్టి ఆరంభమును వారు ఎటువంటి జన్మ, ఎటువంటి పరిస్థితులలో పుడతారు అనేది వారి వారి పూర్వ పాపపుణ్య కర్మలపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ భగవంతుని అధ్యక్షతన జరుగు చున్నప్పటికీ అతడు ఒక న్యాయమూర్తి వలే నిష్పక్షపాతిగా ఉంటాడు. అనగా కోర్టులో న్యాయమూర్తి అనేక తీర్పులు ఇస్తున్నప్పటికీ అతడు నిష్పాక్షికము గానే ఉంటాడు. వాస్తవానికి భగవంతుడు ఎల్లప్పుడూ తన ఆధ్యాత్మిక కార్యములలో నిమగ్నుడై ఉంటాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement