అధ్యాయం 3, శ్లోకం 6
06
కర్మేంద్రియాణి సంయమ్య
య ఆస్తే మనసా స్మరన్ |
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా
మిథ్యాచార: స ఉచ్యతే ||
తాత్పర్యము : కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థములందు మగ్నమై యుండువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచారి యనబడును.
భాష్యము : బద్ధజీవి తనస్థితిని అనుసరించి శాస్త్రములలో తెలియజేసిన విద్యుక్తధర్మములను పాటిస్తూ క్రమేణా తన ఉనికిని పవిత్రీకరించుట ద్వారా పురోగతి చెందాలి. ఇది శాస్త్రనిర్దేశము. వీటిని ధిక్కరించి బహిరంగంగా గొప్పయోగిగా చలామణీ అవుతూ అంతరంగంలో భౌతిక వాంఛలకు దాసులైనవారు, ఈ శ్లోకము ప్రకారము మిధ్యాచారులు అనబడుతారు. అటువంటివారి హృదయము, మనస్సు అపవిత్రముగా నుండుటచే వారు ధ్యానము బూటకుము, వారి మాటల జ్ఞానమునకు విలువలేదు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..