Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 57
57.
చేతసా సర్వకర్మాణి
మయి సన్న్యస్య మత్పర: |
బుద్ధియోగముపాశ్రిత్య
మచ్చిత్త: సతతం భవ ||

తాత్పర్యము : సర్వకర్మల యందు నా పైననే ఆధారపడి సదా నా రక్షణము నందే కర్మ నొనరింపుము. అట్టి భక్తియుత సేవలో సంపూర్ణముగా నా యందే చిత్తము కలవాడ వగుము.

భాష్యము : కృస్ణ చైతన్యములో నున్న వ్యక్తి తాను స ్వతంత్రుడనని భావింపక తన ప్రభువైన కృష్ణుని ఆదేశానుసారము సేవకుని వలే తన కార్యములు కొనసాగించును. సేవకుని భావన వలన లాభనష్టాలకు ప్రభావితుడు కాడు. ఈ శ్లోకము నందు ‘మత్‌ – పర:’ అను పదము చాలా ముఖ్యమైనది. అనగా కృస్నున్ని సేవించుట తప్ప నాకు వేరొక లక్ష్యము లేదు. ”కృష్ణుడు నాకు ఈ సేవను ఇచ్చాడు. దీనిని చేయుట నా బాధ్యత” అని భావించువాడు ఆ కార్యము చేయునపుడు కృష్ణుణ్న స్మరించును. ఆ విధముగా కృష్ణుని ఆదేశమును భగవద్గీత నుండి మరియు గురువు నుండి స్వీకరించవలసి ఉన్నది. ఇది చాలా ముఖ్యము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement