Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 36
36.
సుఖం త్విదానీం త్రివిధం
శృణు మే భరతర్షభ |
అభ్యాసాద్రమతే యత్ర
దు:ఖాంతం చ నిగచ్ఛతి ||

తాత్పర్యము : భరతవంశీయులలో శ్రేష్ఠుడా! ఇక సుఖము నందలి మూడురకలమును గూర్చి నా నుండి ఆలకింపుము. వాని ద్వారా బద్ధజీవుడు సుఖముననుభవించుట, మరికొన్ని మార్లు సర్వదు:ఖముల అంతమును చేరుట జరుగుచుండును.

భాష్యము : బద్ధజీవుడు భౌతిక సుఖమును పదే పదే అనుభవింప యత్నించు చుండును. కాని కొన్నిమార్లు అతడు మహాత్ముల సాంగత్య ఫలముచే అట్టి భౌతిక బంధముల నుండి విముక్తుడు అగుచుండును. అనగా ఏదో ఒక ఇంద్రియ భోగము నందు సదా నిమగ్నమై ఉండెడి బద్ధ జీవుడు తాను కేవలము చేసినదానినే తిరిగి తిరిగి చేయుచున్నాని సత్సాంత్యము ద్వారా అవగాహన చేసికొనినపుడు నిజమగు కృష్ణ చైతన్యము అతని యందు జాగృతము కాగలదు. ఈ విధముగా అతడు కొన్ని మార్లు పునరావృత్తితో కూడిన నామ మాత్ర సుఖము నుండి విముక్తి పొందుచుండును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement