Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 13
13
జ్ఞేయం యత్తత్‌ ప్రకక్ష్యామి
యద్‌ జ్ఞాత్వామృతమశ్నుతే |
అనాదిమత్పరం బ్రహ్మ
న సత్తన్నాసదుచ్యతే ||

తాత్పర్యము : దేనిని తెలసికొనుట ద్వారా నీవు అమృతత్వమును ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. అనాదియును, నాకు అధీనమును అగు బ్రహ్మము ఈ భౌతిక జగపు కార్యకారణములకు అతీతమై యుండును.
భాష్యము ; క్రిందటి శ్లోకాలలో కర్మక్షేత్రము గురించి మరియు దానిని తెలియు జీవుని గురించి తెలియజేసెను. అంతేకాక జీవుని వాస్తవ స్థితిని తెలియజేయు జ్ఞానమార్గాన్ని కూడా వివరించుట జరిగినది. ఇక ఇప్పుడు ఆత్మపరమాత్మల గురించి వివరణ ప్రారంభము చేసెను. ఈ విజ్ఞానమును తెలుసుకున్నవారు అమృతాన్ని త్రాగిన వారివలే శాశ్వతముగా జీవించవచ్చును. రెండవ అధ్యాయములో తెలుపబడి నట్లు ఆత్మ శాశ్వతమైనది. ఈ శ్లోకము కూడా దానినే బలపరచుచున్నది. జీవుడు ఎప్పుడు భగవంతుడి నుండ పుట్టాడు అనేది మనము చెప్పలేము. అనగా అనాదిగా జీవునికి ఉనికి ఉన్నదని గుర్తించవలెను. ఉపనిషత్తుల ప్రకారము జీవుడు శాశ్వతముగా భగవంతుని దాసుడని తెలియవచ్చుచున్నది. దీనినే శ్రీ చైతన్య మహాప్రభువు కూడా ప్రచారము చేసిరి. ఈ శ్లోకములో తెలిపిన బ్రహ్మము విజ్ఞాన బ్రహ్మమైన జీవుణ్ని సూచిస్తుంది కాని ఆనంద బ్రహ్మమైన భగవంతుణ్ని కాదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….

Advertisement

తాజా వార్తలు

Advertisement