Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 30
30.
ప్రవృత్తి చ నివృత్తిం చ
కార్యాకార్యే భయాభయే |
బంధం మోక్షం చ యా వేత్తి
బుద్ధి: సా పార్థ సాత్త్వికీ ||

తాత్పర్యము : ఓ పార్థా! ఏ బుద్ధి ద్వారా మనుజుడు ఏది చేయదగినదో ఏది చేయరానిదో, దేనికి భయపడవలెనో దేనికి బయము నొందరాదో, ఏది బంధకరమో ఏది ముక్తి దాయకమో తెలిసికొన గలుగునో అట్టి బుద్ధి సత్త్వ ప్రధానమైనది.

భాష్యము : శాస్త్ర నిర్దేశములను అననుసరించి కార్యముల నొనరించుట లేక చేయదగిన కర్మలను చేయుట ‘ప్రవృత్తి’ యనబడును. అట్టు శాస్త్రములందు నిర్దేశింపబడని కర్మలను ఎన్నడును చేయరాదు. ఆ శాస్త్ర నిర్దేశములను ఎరుగనివాడు కర్మల యందు మరియు కర్మఫలముల యందు బద్ధడగుచున్నాడు. అట్టి విచక్షణా జ్ఞానమును కలిగించు బుద్ధియే సత్త్వ గుణము అనబడును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement