Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 29
29.
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ
గునతస్త్రివిధం శృణు |
ప్రోచ్యమానమశేషేణ
పృథక్త్వేన ధనుంజయ ||

తాత్పర్యము : ఓ ధనంజయా! ఇక త్రిగుణములననుసరించి యున్న వివిధములైన బుద్ధి మరియు నిశ్చయములను విశదముగా నా నుండి ఆలకింపుము.

భాష్యము : జ్ఞానము, జ్ఞేయము, జాత అనేడి మూడు అంశములను త్‌రగుణములను అనుసరించి వివరించిన పిమ్మట భగవానుడు కర్మ యొక్క బుద్ధి మరియు నిశ్చయములను అదే విధముగా వివరింపనున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement