Monday, November 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 22
22.
యత్తు కృత్స్నవదేకస్మిన్‌
కార్యే సక్తమహైతుకమ్‌ |
అతత్త్వార్థవదల్పం చ
తత్తామసముదాహృతమ్‌ ||

తాత్పర్యము : ఏ జ్ఞానము ద్వారా మనుజుడు అల్పమైనట్టి ఒకానొక కార్యమునందు కారణము మరియు సత్యావగాహనము లేకుండా అదియే సర్వస్వమనెడి భావనలో ఆసక్తుడగునో అట్టి జ్ఞానము తమోగుణము సంబంధమైనదని చెప్పబడును.

భాష్యము : ప్రామాణిక ఆచార్యుల నుండి గాని శాస్త్రముల ఆధారముగా గానీ నేర్వని జ్ఞానము తమోగుణ ప్రధానము. కాబట్టి సామాన్య మానవుల జ్ఞానము ఈ శరీరమునకు మాత్రమే పరిమితమై ఉంటుంది. శరీరమే సర్వస్వమని దానిని సౌకర్యవంతముగా ఉంచుటకు నేర్చేదే జ్ఞానమని భావించుదురు. అటువంటి వ్యక్తి భగవంతుడంటే ధనమని, జ్ఞానమం టే శరీర సంతృప్తియేనని భావిస్తాడు. ఇది జంతువుకుండే జ్ఞానముతో సమానము. అవి కూడా ఆహారము, నిద్ర, సంసార జీవితము మరియు స్వీయ రక్షణల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాయి. ఇక పరమ సత్యమునకు సంబంధించిన ఆలోచనే ఉండదు. శరీరమునకు మించి ఆత్మ గురించి ఆలోచింపచేయని జ్ఞానము తమోగుణ ప్రధానము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement