Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 19
19.
జ్ఞానం కర్మ చ కర్తా చ
త్రిధైవ గుణభేదత: |
ప్రోచ్యతే గుణసంఖ్యానే
యథావచ్ఛృణు తాన్యపి ||

తాత్పర్యము : ప్రకృతిజన్య త్రిగుణముల ననుసరించి జ్ఞానము, కర్మము, కర్త యనునవి మూడు రకములు. ఇక వానిని గూర్చి నా నుండి ఆలకింపుము.

భాష్యము : గడచిన అధ్యాయాలలో త్రిగుణములను గూర్చి సవివరముగా చర్చించుట జరిగినది. అక్కడ సత్వగుణము ప్రకాశవంతమైనదని, రజోగుణము భౌతిక భావనా పూర్ణమని ఇక తమోగుణము సోమరితనమును, బద్ధకమునకు అనుకూలమని తెలియజేయటమైనది. అంతేకాక వేరు వేరు గుణాలలో ఉన్నవారు వేరు వేరు రకాల పూజలు చేస్తూ ఉంటారని కూడా వివరించటమైనది. అయితే సత్త్వ గుణముతో సహా ఈ త్రిగుణములన్నీ బంధనమునకే కారణమవుతాయి కాని ముక్తులను చేయలేవు. ఇక ప్రస్తుతము భగవంతుడు త్రిగుణములను బట్టి వేరు వేరు రకాల జ్ఞానము, కర్మ మరియు కర్తలను గురించి వివరించనున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement