Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 7
7.
నియతస్య తు సన్న్యాస:
కర్మణో నోపపద్యతే |
మోహాత్‌ తస్య పరిత్యాగ:
తామస: సరికీర్తిత: ||

తాత్పర్యము : వి ధ్యుక్త ధర్మములను ఎన్నడును విడువరాదు. మోహకారణమున ఎవ్వరేని తన విద్యుక్తక్తధర్మమును విడిచినచో అట్టి త్యాగము తమోగుణమునకు సంబంధించినదిగా చెప్పబడును.

భాష్యము : భౌతిక తృప్తి కొరకు చేయబడు కర్మను తప్పక విడువవలయును. కాని మనుజుడు ఆధ్యాత్మికతకు ఉద్దరించునటువంటి ప్రసాదము చేయుట, నైవేద్యము పెట్టుట, ప్రసాదమును స్వీకరించుట వంటి కార్యములు మాత్రము చేయుటకు ఉపదేశింపబడినవి. సన్యాసాశ్రమము నందున్న వ్యక్తితన కొరకై వంట తయారుచేసి కొనరాదని తెలుపబడినది. కాని శ్రీకృష్ణభగవానుని కొరకై వండుట నిషిద్ధము కాదు. అదే విధముగా సన్యాసియైనవాడు తన శిష్యుని కృష్ణభక్తి పురోగతికై అతని వివాహమును సైతము జరుపవచ్చును. ఒకవేళ అతడట్టి కార్యములను త్యజించినచో తమోగుణమున కార్యములను నిర్వహించిన వాడగుతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement