Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 1
ఓం శ్రీ పరమాత్మనే నమ:

అథ అష్టాదశోధ్యాయ:
మోక్షసన్న్యాస యోగ:

1.
అర్జున ఉవాచ
సన్న్యాసస్య మహాబాహో
తత్త్వమిచ్ఛామి వేదితుమ్‌ |
త్యాగస్య చ హృషీకేశ
పృథక్‌ కేశినిషూదన ||

తాత్పర్యము : అర్జునుడు పలికెను : ఓ మహాబాహో! కేసిసంహారా! ఇంద్రియధీశా! త్యాగము, సన్యాసము అనువాని ప్రయోజనమును నేను తెలిసికొనగోరుచున్నాను.

భాష్యము : భగవద్గీత యొక్క ప్రతి అధ్యాయములో భగవంతుని పట్ల భక్తియే జీవిత లక్ష్యమని నొక్కొ వక్కాణించటం జరిగినది. చివరగా ప్రతి కార్యము భగవంతుని ప్రీత్యర్ధమే చేయవలెనని ” ఓం తత్‌ సత్‌” మంత్రము ద్వారా సూచించటమైనది. పూర్వ ఆచార్యులు, బ్రహ్మ సూత్రములు మరియు వేదాంత సూత్రముల ఆధారముగా వీటన్నింటినీ నిరూపించుట జరిగినది. ప్రస్తుతము ఈ శ్లోకము నందు అర్జునుడు తనకున్న సంశయములను కేశీ రాక్షసుణ్ని సంహరించినట్లు ఖండించివేయమని , హృషీకేశుని వలే తన మనస్సుకు స్థిమితమును కలిగించమని అర్థిస్తూ ఉన్నాడు. అర్జునుడు త్యాగమునకు మరియు సన్యాసమునకు గల బేధమేమని ఇక్కడ శ్రీకృష్ణున్ని ప్రశ్నించుచున్నాడు.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement