Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 10
10
అసక్తిరనభిష్వంగ:
పుత్రదారగృహాదిషు |
నిత్యం చ సమచిత్తత్వమ్‌
ఇష్టానిష్టోపపత్తిషు ||

తాత్పర్యము : అనాసక్తి, పుత్రకళత్ర గృహాదుల బంధము నుండి విముక్తి, సుఖదు:ఖ సమయములందు సమభావము.

భాష్యము : 13,14 అసక్తి : అనభిష్వంగ: పుత్ర దారా గృహ ఆదిషు :- కుటుంబ సభ్యులు భగవంతుని నామాన్ని జపించుట, కీర్తన చేయుట, ప్రసాదము స్వీకరించుట, భగవద్గీతా భాగవతములను శ్రవణము చేయుట, విగ్రహారాధనలో పాల్గొనేటట్లు చేసినట్లయితే గృహమే ఆలయముగా మారుతుంది. అలాంటప్పుడు గృహమును విడిచి వెళ్ళవలసిన అవసరము లేదు.
15. సమచిత్తత్వము : ఇష్ట అయిష్టాలు, సుఖ దు:ఖాలు అనేవి వస్తూపోతూ ఉంటాయని గ మనించినవారు భౌతిక భావనతో వాటిని చూడకుండా సమభావనను కలిగి ఉండుట.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….

Advertisement

తాజా వార్తలు

Advertisement